Nellore Rains: ఊళ్లకు ఊళ్లనే తరలిస్తున్న అధికారులు..
Continues below advertisement
సోమశిలనుంచి పెన్నాకు భారీగా నీటిని వదిలిపెట్టడంతో పెన్నమ్మ ఊళ్లను చుట్టేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ముంపు గ్రామాల వాసుల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తం 9 మండలాల పరిధిలోని 40 గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. ముంపు ప్రాంతాల వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నెల్లూరు రూరల్ మండలం, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల.. మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు ముంపు ముప్పు ఎక్కువగా ఉన్నట్టు హెచ్చరించారు అధికారులు.
Continues below advertisement