Anantapur Rains Update: కదిరిలో కూలిన భవనాలు.. నలుగురు మృతి.. శిథిలాల కింద మరికొంతమంది
Continues below advertisement
అనంతపురం జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. కదిరి పట్టణం లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాలకు 2 భవనాలు కూలిపోయాయి. స్థానిక ఛైర్మన్ వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4 గంట సమయంలో నిద్రలో ఉండగా సంఘటన చోటు చేసుకుంది. భవన శిథిలాలను పోలీసులు, రెస్క్యూ టీం అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. నలుగురు మృతదేహాలు బయటకు తీశారు.. మిగిలిన వారి కోసం.. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది.
Continues below advertisement