Anantapuram : అంతులేని ఆనందం... అనంతలో దశాబ్దాల తర్వాత నదుల్లో జలకళ
Continues below advertisement
అనంతపురం జిల్లా వాసులకు, వాన చినుకంటే... అమృతం చుక్కతో సమానం. వాన కురిసే శబ్దమే తప్ప.. నీటి గలగలలు అక్కడి వారికి అపురూపం. వానొచ్చినప్పుడు ఓ మాదిరి వంకలు పారుతుండగా చూడ్డమే తప్ప.. ఇంకిపోయిన నదుల్లో నీటి పరవళ్లను చూసి ఎరుగరు. అట్లాంటి చోట.. ఇప్పుడు జలసిరులు తాండవిస్తున్నాయి. ఆప్రాంత ప్రజల మదిమదిలో ఆనందం పరవళ్లు తొక్కేలా చేస్తున్నాయి.
Continues below advertisement