Kadapa Onion Farmers : కడప లో ఉల్లి రైతుల కష్టాలు | ABP Desam
Continues below advertisement
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం లోని ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయాయి. సాగుచేసిన ఉల్లి పంట చేతికందే సమయంలో అకాల వర్షంతో పూర్తిగా తడవడంతో మోసులు రావడం జరిగింది. పంట కోసిన తర్వాత ఆరవేసిన సమయంలో ఉల్లికి మోసులు రావడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. దాదాపు ఎకరాకు 80 వేల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చుపెట్టి ఇలా నష్టపోవడం జీర్ణించుకోలేని రైతుల భాధ వర్ణనాతీతం. కనీసం కూలి పని చేసిన వారికి డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని కన్నీటితో బాధను వ్యక్తం చేశారు.
Continues below advertisement