కడప కలెక్టర్ ఆధ్వర్యంలో- కోవిడ్ బాధిత కుటుంబాలకు చేయూత

Continues below advertisement

కోవిడ్ తో మృతిచెందిన కుటుంబాలకు అండగా నిలవడానికి కొన్ని స్వచ్చంద సంస్థల ద్వారా వారికి మనోధైర్యాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని కడప జిల్లా కలెక్టర్ విజయరామ రాజు అన్నారు. కొన్ని కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ని కోవిడ్ వల్ల కోల్పోయారని అలాంటి కుటుంబాలు సంపాదన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కడప నగరంలో కొన్ని స్వచ్చంద సంస్థల సహకారం తో కోవిడ్ వల్ల చనిపోయిన కుటుంబాల చిన్న తరహా వ్యాపారాలకు కావల్సిన సహాయ సహకారాలు అందించారు. దాదాపు 100 కుటుంబాలకు అండగా జిల్లా అధికార యంత్రాంగం నిలిచింది. కోవిడ్ తో చనిపోయిన కుటుంబాల్లో ఇలాంటి సహాయ సహకారాల వల్ల వారు స్వతహాగా సంపాదించుకునే అవకాశం కల్పించారు. జిల్లా కలెక్టర్ చొరవ వల్లే తమకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్లు అయిందని బాధిత కుటుంబాలు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram