కియా కార్ల తయారీ ప్లాంట్ లో రాడ్లతో కొట్టుకున్న ఉద్యోగులు
Continues below advertisement
అనంతపురం జిల్లా పెనుకొండ అమ్మవారిపల్లి కియా కార్ల కంపెనీ వద్ద ఉద్యోగుల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఉద్యోగులు రాడ్లతో కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కియా ప్రధాన ప్లాంటులో హుండాయ్, ట్రాన్సిస్ కంపెనీ సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య వివాదం తలెత్తడంతో ఒకరినొకరు రాడ్లతో కొట్టుకున్నారు. కియా ప్రధాన ప్లాంట్ పరిసరాల్లో జరిగిన ఘర్షణ ఎలాంటి వివాదానికి దారితీస్తుందోనని ఉద్యోగులు భయపడుతున్నారు.
Continues below advertisement