Anantapur: భారీ వరదలో చిక్కుకున్న 11 మంది... అనంతపురం జిల్లాలో టెన్షన్ టెన్షన్
Continues below advertisement
అనంతపుర జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ధర్మవరం కొత్తచెరువు మార్గమధ్యలో నీటి ప్రవాహంలో 11 మంది చిక్కుకున్నారు. కారులో ప్రయాణిస్తుండగా వరద ఉధృతి పెరిగిపోయి కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు కారుకు అడ్డంగా జెసిబి నిలిపారు. 11 మందిని జేసీపీ ఎక్కారు. జేసీబీ జలదిగ్బంధంలో చిక్కుక్కుంది. చుట్టూ నీటి ఉధృతి పెరిగిపోతుండటంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం హెలికాప్టర్ ను రంగంలోకి దించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Continues below advertisement