Annamayya Project : అన్నమయ్య డ్యామ్ అప్పుడు-ఇప్పుడు..ఏబీపీ ఎక్స్‌క్లూజివ్
మీరు చూస్తున్న విజువల్స్ కడప జిల్లాలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్ట్ ను ఏబీపీ దేశం సందర్శించినప్పుడు తీసినవి. ఎంతో అందంగా కొండల మధ్య, ప్రశాంతంగా ఉన్న చెయ్యేరు ప్రాజెక్ట్ ను చూడండి. ఏదో టూరిజం స్పాట్ లాగా వుంది కదా చూస్తుంటే. అదే అన్నమయ్య ప్రాజెక్ట్ కడప లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఎలా కొట్టుకుపోయిందో చూడండి. వరదలకు ముందు డ్యామ్ గురించి , ప్రత్యేకతను గురించి ఏబీపీ దేశం ఎక్సక్లూజివ్ గా స్టోరీ ప్రసారం చేసింది. కొద్ది రోజులకే వరదల కారణంగా డ్యామ్ కు ఇలాంటి పరిస్థితి వచ్చింది. చిత్తూరు జిల్లా లోని పింఛా డ్యాం అన్ని గేట్లు ఎత్తివేయడంతో అన్నమయ్య ప్రాజెక్టుకు అతి వేగంగా భారీ స్థాయిలో వరద నీరు వచ్చింది. దీంతో అధికారులు అన్నమయ్య ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి దాదాపు లక్ష క్యూ సెక్కుల నీటిని విడుదల చేసారు. ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసారు. భారీ వర్షాలకు అన్నమయ్య డ్యామ్ కరకట్ట మొత్తం కొట్టుకుపోయింది. వరదలకు గుర్తు పట్టలేనంతగా అయిపోయింది అన్నమయ్య డ్యామ్.