AP News: జోగి రమేష్ మాట్లాడటానికి వెళ్లారు.. గుంటూరు డీఐజీ వివరణ

Continues below advertisement

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద జరిగిన ఘర్షణపై గుంటూరు డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి అనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈనెల 17న ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ జరిగిందని గుంటూరు డీఐజీ అన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వినతిపత్రం ఇవ్వడానికే వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. నిరాధారంగా మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయన్నారు. ఈ ఘటనలో ముందుగా జోగి రమేశ్ కారుపై దాడి జరిగిందని తెలిపారు. డీజీపీ ఆఫీస్‌ వద్ద టీడీపీ లీడర్లు హంగామా చేశారని.. ఆఫీసులో డీజీపీ లేరని తెలిసి కూడా 70 మంది హడావుడి చేశారని వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram