Bhuvan Jai Record: రష్యాలోని అత్యున్నత శిఖరంపై చంద్రుడి తేజం భువన్ జై

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన  మాస్టర్ గంధం భువన్ జై చరిత్ర సృష్టించాడు. కేవలం 8 సంవత్సరాల 3 నెలల వయసులో యూరోప్ ఖండంలోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్‌ను సెప్టెంబర్  18 వ తేదీన అధిరోహించాడు. తద్వారా ఈ శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. మౌంట్ ఎల్బ్రస్ ఎత్తు 5642 మీటర్లు కాగా, ఐరోపా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం ఇది. 3 వ తరగతి విద్యార్థి మాస్టర్ భువన్ గడ్డ కట్టే చలిలోనూ ఈ శిఖరాన్ని అధిరోహించాడు. గంధం భువన్ మరెవరో కాదు  ప్రముఖ IAS అధికారి గంధం చంద్రుడి కుమారుడు. భువన్ కు ఆటలంటే చాలా ఇష్టం. అలాగే పర్వతారోహణలో కూడా అతని ఆసక్తిని గమనించిన అతని తల్లితండ్రులు ట్రెక్కింగ్, మౌంటైనీరింగ్ లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram