Godavari Floods: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉద్ధృతి... దిగువకు నీరు విడుదల
Continues below advertisement
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి 44 అడుగులు స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద ఉద్ధృతి 8.90 అడుగుల స్థాయికి పెరిగింది. దీంతో దిగువకు 6.37 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. విలీన మండలాల్లోని ఎటపాక మండల పరిధిలో నెల్లిపాక వీరాయ గూడెం ప్రధాన రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నాలుగు గ్రామాల పరిధిలోని రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజి దిగువన ఉన్న లంక గ్రామాలకు వరద తాకిడి ఉండే పరిస్థితి ఉండటంతో రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
Continues below advertisement