ఇప్పటికింకా ఈ బామ్మ వయసు పదహారేనట.. అధికారులే చెబుతున్నారీ మాట!
Continues below advertisement
పింఛన్ తొలగింపులో విచిత్రాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో షేక్ అమీనాభీకి షాక్ ఇచ్చారు అధికారులు. ఇరవై ఏళ్లుగా పింఛన్ తీసుకుంటోంది అమీనాభి. అయితే ఈ మధ్య పింఛన్ ఆపేశారు. ఏమైందని అడిగితే ఆధార్ కార్డు చూపించారు. ఆధార్‌లో ఆమె 2005లో పుట్టినట్టు చూపించారు. అది చూసి బిత్తర పోయారు అమీనాభీ. ఇదేంటని అధికారులను అడిగారు ఆధార్‌లో సరిచేసుకోండని అధికారులు ఆన్సర్ చేశారు. ఆ వృద్ధురాలు వారం రోజులగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టించుకున్న వాళ్లు లేరు.. సమస్య అడిగిన వారూ లేరు.
Continues below advertisement