Road Accident: నెల్లూరు-ముంబై హైవే మీద యాక్సిడెంట్.. వాహనంలోనే ఇరుక్కుపోయిన డ్రైవర్
నెల్లూరు - ముంబై జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తాజాగా జరిగిన ఓ ప్రమాదంలో ఓమ్నీ వ్యాన్ డ్రైవర్ లోపల ఇరుక్కుపోయి నరకం చూశాడు. అతి కష్టమ్మీద అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదాల్లో వాహనాలు నుజ్జు నుజ్జవడం, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడో డ్రైవర్ ప్రమాదానికి గురైన తర్వాత గంటసేపు వాహనంలోనే ఇరుక్కుపోయాడు. దెబ్బలకి ప్రాణం విలవిల్లాడుతూ హాహాకారాలు పెడుతున్నా ఎవరూ ఏమీ చేయల్ని పరిస్థితి. ఎలాగోలా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.