Vasishta Bridge: వశిష్ఠ వారధి క్రుంగి పోయినట్లు వస్తున్న పుకార్లు నమ్మొద్దు
Continues below advertisement
ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ దిండి - చించినాడ గ్రామాల మధ్య ఉన్న వశిష్ఠ వారధి క్రుంగి పోయినట్లు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఒక వీడియో హల్ చల్ చేస్తుంది.వాస్తవానికి ఈ బ్రిడ్జికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. బ్రిడ్జిపై రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని రాజోలు సిఐ దుర్గా శేఖర్ రెడ్డి స్వయంగా ఆయనే బ్రిడ్జి పై నిలబడి ఈ తరహా పుకార్లు నమ్మవద్దని చెప్పారు.ఎక్కడో జరిగిన సంఘటనలు ఈ ప్రాంతంలో జరిగినట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ దుర్గా శేఖర్ రెడ్డి హెచ్చరించారు..
Continues below advertisement