ఏడు గంటల తర్వాత ఇంట్లో నుంచి రావాలంటే భయపడుతున్న సిక్కోలు జిల్లా వాసులు
Continues below advertisement
సిక్కోలు జిల్లాలో గ్రామ సింహాలు గర్జిస్తున్నాయి. పల్లెలు పట్టణాలు అని తేడాలేకుండా ఎక్కడబడితే అక్కడ సంచరిస్తూ జిల్లా వాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు పెంపుడు జంతువులు,పిల్లలు అని లెక్కచేయకుండా వెంబడించి మరీ దాడిచేస్తున్నాయి. మాంసాహారానికి అలవాటుపడిన ఊర కుక్కలు పిచ్చెక్కి పిల్లలపై దాడి చేస్తుంటే వీటిని నియంత్రించాల్సిన అధికారులు వెర్రి తలలు వేస్తున్నారు. కుక్కల సంతతి నియంత్రణలో మున్సిపల్ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు ఒకరిమీద ఒకరు తోసుకుంటూ వాటి శస్త్ర చికిత్సలను గాలికి వదిలేస్తున్నారు. దీనితో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగిన కుక్కల సంఖ్యతో జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
Continues below advertisement