డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
Continues below advertisement
ఇప్పటి వరకూ ఎన్నో అవమానాలకు గురైనా సంయమనం పాటిస్తూ వచ్చామని ఇకపై సమస్యల పరిష్కారానికి ఒప్పంద పత్రం రాసి ఇచ్చే వరకూ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తేలేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కడప జిల్లాలోని ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే ఉద్యమ బాట పట్టినట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిన అధికారులు సైతం పెడ చెవిన పెట్టి రోడ్డు పైకినెట్టేశారని మండిపడ్డారు. ప్రజలు కూడా తమ బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. పీఆర్సీపై సీఎం ప్రకటించినా నివేదిక ఇవ్వడానికి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏమిటని నిలదీశారు.
Continues below advertisement