AP High Court Serious: 400 మంది పిల్లలకు రెండే టాయిలెట్లా.. గురుకుల పాఠశాల నిర్వహణపై హైకోర్టు ఆగ్రహం
Continues below advertisement
AP High Court Serious: అపరిశుభ్రతంగా ఉండో మరుగుదొడ్లు... పక్కనే కాలువలో ప్రవహించే కలుషిత నీటితో స్నానం.. చుట్టూ ఈగలు, దోమల స్వైరవిహారం... చలికాలమైనా కటిక నేలపై పడుకోవడం... ఇన్ని సమస్యలున్నా ఈ స్కూలును పట్టించుకునే నాథుడే లేడు. వెనకబడిన వర్గాల పిల్లలు ఉంటున్న వసతి గృహం పరిస్థితి ఇది. ఈ సమస్యలపై విద్యార్థుల తల్లితండ్రులు, ప్రజా సంఘాల నాయకులు ఎన్నోసార్లు నిరసనలు తెలిపారు. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి కనీస స్పందన రాకపోవడంతో తాండవపల్లికి చెందిన సామాజికవేత్త, లాయర్ పచ్చిమాల బాబ్జి హైకోర్టు మెట్లెక్కారు.
Continues below advertisement