Ananthapur: అనంతపురం లో టీడీపీ ముఖ్య నాయకుల గృహ నిర్బంధం
Continues below advertisement
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో అందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈరోజు రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. అనంతపురం లో తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు , హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి.కె పార్థసారథి , అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తదితరులను అర్ధరాత్రి నోటీసులు జారీ చేసి గృహనిర్బంధం చేశారు. జిల్లా లోని అన్ని నియోజకవర్గాలలో ఉన్న ముఖ్య తెలుగుదేశం నాయకులకు ఇదే పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సైతం భారీ పోలీసు బందోబస్తు నడుమ నడుపుతున్నారు.
Continues below advertisement