Akira Nandan And Adya | అకీరా, ఆద్యలను ఆపిన పోలీసులపై విరుచుకుపడిన నాగబాబు

Continues below advertisement

పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారానికి వచ్చిన అకీరా, ఆద్యలకు అనుకోని సంఘటన ఎదురైంది. ప్రమాణస్వీకారం చేసే స్టేజీకి ఎదురుగా ప్రత్యేకంగా నారా, మెగా ఫ్యామిలీలకు గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందులోకి పవన్ బిడ్డలు అకీరా, ఆద్య వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.ఈ దారి గుండా కాదు వేరే రూట్ నుంచి వెళ్లాలని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నాగబాబు వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పవన్ బిడ్డల్నే ఆపుతారా..? అంటూ ఫైర్ అయ్యారు. ఐనా..అధికారులు వినకపోవడంతో నాగబాబు తాను కూడా గ్యాలరీలోకి రానని చెబుతూ అకీరా, అద్యలను వెనక్కి తీసుకెళ్లారు. దీంతో..అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు నాగబాబుకు నచ్చజెప్పి వారిని లోపలికి అనుమతిచ్చారు.

ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లే క్రమంలో జనసేన కార్యదర్శి నాగబాబుకు కాస్త ఇబ్బంది ఎదురైంది. వేదిక వద్దకు వెళ్లే క్రమంలో భద్రతా సిబ్బంది నాగబాబును అడ్డుకున్నారు. అదే సమయంలో నాగబాబు వెంట పవన్ కల్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యా కూడా ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వీరిని నేరుగా వెళ్లనివ్వకుండా కాసేపు నిలువరించడంతో నాగబాబు ఒకింత అసహనానికి గురయ్యారు. భద్రతా సిబ్బందిపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram