Vijaya Sai Reddy on Chandrababu Naidu | చంద్రబాబు ప్రమాణస్వీకారంపై విజయ సాయిరెడ్డి కామెంట్స్

తన ప్రమాణస్వీకారానికి ముందే రాష్ట్రంలో దాడులు జరపాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని వైసీపీ నేత విజయ సాయిరెడ్డి ఆరోపించారు. ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికైనా మద్దతిస్తారని .. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీ క్యాడర్ పై దాడులు జరుగుతున్నాయని పోలీసులు పట్టించుకోవం లేదని  చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమేనని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఏదైనా బిల్లు పాస్ అవడానికి వస్తే.. ఆ బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే తాము మద్దతిస్తామన్నారు. ప్రత్యేకంగా తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని..ఏ నిర్ణయం అయినా రాష్ట్ర ప్రయోజనాల మేరకే ఉంటుందన్నారు.               

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola