Furry Green Snake | పాములంటే పొలుసులతో మిలమిలా మెరుస్తూ.. చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఉంటాయి కదూ. అయితే, ఈ పాము ఆ టైపు కాదు. బొచ్చు కుక్కలా భలే క్యూట్‌గా ఉంటుంది. ఒళ్లంతా పొలుసులకు బదులు వెంటుకలు ఉంటాయి. పచ్చ రంగులో కనిపించే ఈ పాము ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


థాయ్‌లాండ్‌లోని ఓ కొలనులో కనిపించిన ఈ పామును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అకస్మాత్తుగా చూస్తే.. ఇదేదో పెద్ద సైజు గొంగలి పరుగు కావచ్చని అనుకుంటాం. కానీ, దీని నోటిని చూశాక అభిప్రాయం మార్చుకుంటాం. ఎందుకంటే, దీనికి పాము తరహాలోనే నాలుక ఉంది. పాములాగానే గింగిరులు తిరుగుతోంది. దానితోపాటు దాని బొచ్చు కూడా సొగసుగా కదులుతోంది. 


సాఖోన్ నఖోన్ ప్రాంతంలో నివసిస్తున్న 49 ఏళ్ల తు అనే వ్యక్తికి ఈ పాము కనిపించింది. అది ఏ రకం పామో తెలియపోవడం వల్ల దాన్ని ఏలియన్ స్నేక్ అని పిలుస్తున్నారు. అధికారులకు చూపించడం కోసం తు ఆ పామును తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. స్థానికులు దీన్ని బొచ్చు పాము అని పిలుస్తున్నారు. కొందరు వాటర్ స్నేక్ అని అంటున్నారు. అయితే, ఆ పాము సొంత బొచ్చు కాకపోయి ఉండవచ్చని కొందరు అంటున్నారు. 


Also Read: ఓ మై గాడ్, ఇతడి నాలుకపై జుట్టు పెరుగుతోంది, కారణం తెలిస్తే ఇక నిద్రపట్టదు!


ఇలాంటి పాములు నీళ్లలో రాతి పగుళ్లలో నివాసం ఉంటాయని, దాని వల్ల వాటి శరీరంపై నాచు పేరుకుపోతుందని, అందుకే ఈ పాము అలా పచ్చ రంగులో కనిపిస్తోంది కాబోలు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పాములను మాస్క్డ్ వాటర్ స్నేక్ అని కూడా అంటారని నిపుణులు తెలుపుతున్నారు. ఇది ఎక్కువగా ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే హోమలోప్సిడే కుటుంబానికి చెందిన తేలికపాటి విషపూరిత పాము జాతికి చెందిన పామై ఉండవచ్చని అంటున్నారు. 
వీడియో: 



Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?