Raviteja In Mega154: మెగాస్టార్ కోసమా? మాంచి రెమ్యూనరేషన్ కోసమా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రవితేజ కీలకమైన పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే... మాస్ మహారాజ ఈ సినిమా ఓకే చేసింది మెగాస్టార్ కోసమా? మాంచి రెమ్యునరేషన్ కోసమా? అనే డిస్కషన్ మొదలైంది. 

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. Mega154 అనేది వర్కింగ్ టైటిల్. అయితే... ఈ సినిమాకు 'వాల్తేరు వాసు' (Megastar Chiranjeevi - Bobby film Titled Walter Vasu?) టైటిల్ ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. అది పక్కన పెడితే... ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ (Raviteja In Mega154) కీలకమైన ప్రధాన పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ఆయన షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ గతంలో కలిసి నటించారు. అయితే... చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. 'అన్నయ్య' సినిమాలో చిరు తమ్ముడిగా రవితేజ కనిపించారు. 'శంకర్ దాదా జిందాబాద్'లోని పాటలో తళుక్కున మెరిశారు. ఇప్పుడు 'మెగా 154'లో నటిస్తున్నారు. రవితేజ 'పవర్' సినిమాను బాబీ డైరెక్ట్ చేశారు. అంతకు ముందు 'డాన్ శీను'కు స్క్రీన్ ప్లే, 'బలుపు' సినిమాకు కథ అందించారు. చిరంజీవి సినిమాలో పాత్ర గురించి ఆయన చెప్పిన వెంటనే రవితేజ 'ఎస్' అన్నారట.

ఫిల్మ్ నగర్ గుసగుస ఏంటంటే... ఈ సినిమా కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. #Mega154 ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సినిమాలో అతిథి పాత్ర కోసం రవితేజకు రూ. 10 కోట్లు ఇస్తున్నారట. పాతిక రోజుల్లో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. దాంతో పాతిక రోజులకు పది కోట్లు అంటే... రవితేజ ఈ సినిమా ఓకే చేసినది మెగాస్టార్ కోసమా? మాంచి రెమ్యూనరేషన్ కోసమా? అనే డిస్కషన్ మొదలైంది ఫిల్మ్ నగర్ సర్కిళ్లలో! ఇటువంటి చర్చలు ఎప్పుడూ ఉండేవే. ఇది పక్కన పెడితే చిరంజీవి - రవితేజ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Also Read: కమల్ హాసన్ 'విక్రమ్' విడుదల తేదీ ఖరారు, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?

చిరంజీవి సరసన మెగా154లో శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల స్టయిలిస్ట్.

Also Read: 'మారన్' రివ్యూ: కార్తీక్, ధనుష్ కలిసి ఇలా చేశారేంటి?

Continues below advertisement