Talcum Powder Side Effects | ప్పుడే వేడి మొదలైంది. ఉక్కపోతతో చెమటలు చికాకు తెప్పిస్తున్నాయి. వేసవిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. చంకల్లో చెమట వల్ల దుర్వాసన కూడా వస్తుంది. దీంతో చాలామంది అక్కడ చెమట పట్టకుండా పౌడర్ రాసుకుంటారు. దానివల్ల చెమట నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. మరి, అక్కడ పౌడర్ రాసుకోవడం చర్మానికి మంచిదేనా? దీనిపై వైద్యులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? 


పుండ్లుకు కారణం కావచ్చు: చంకలు, గజ్జల్లో అతిగా పౌడర్ రాయడం వల్ల అక్కడ పొడిలా పేరుకుపోతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉంది. టాల్కమ్ పౌడర్‌లు స్వేద రంథ్రాలను బ్లాక్ చేస్తాయి. దానివల్ల చెమట బయటకు వెళ్లదు. దానివల్ల చెమట వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినా, భవిష్యత్తులో అది చర్మ సమస్యలకు దారి తీయోచ్చు. చంకలో ఏమైనా గాయాలుంటే అవి పెద్దవి కావచ్చు. లేదా కొత్తగా పుండ్లకు కారణం కావచ్చు. పౌడర్ చంకల్లో అట్టకట్టేస్తే బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. 


బేబీ పౌడర్ బెస్ట్: ఒక వేళ తప్పని పరిస్థితుల్లో చంకల్లో పౌడర్ రాయాలని అనుకుంటే తప్పకుండా సాధారణ టాల్కమ్ పౌడర్‌కు బదులుగా బేబీ పౌడర్‌ను రాయండి. బేబీ పౌడర్ మీ చంకలు, గజ్జల్లోని చర్మంపై సున్నితంగా పనిచేస్తుంది. పైగా అందులో ప్రమాదకర రసాయనాలు కూడా ఉండవు. పౌడర్ చెమట మొత్తాన్ని పీల్చేసి మీకు ఉపశమనం కలిగిస్తుంది. దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది. డివోడరెంట్(deodorant) లేదా యాంటిపెర్స్పిరెంట్(antiperspirant) కంటే ఫౌడర్ రాయడమే మంచిది. 


చంకలు నల్లగా ఎందుకు మారిపోతాయి?: చాలామందికి సాధారణ చర్మ రంగు కంటే ముదురు రంగులోకి చంకల కలర్ మారుతుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. షేవింగ్, డియోడరెంట్స్, యాంటీపెర్స్పిరెంట్స్, టాల్కమ్ పౌడర్, కెమికల్ కాంపోనెంట్స్ ఎక్కువగా వాడటం వల్ల అక్కడి చర్మం నల్లగా మారిపోతుంది. మీకు నిత్యం చర్మం మూలల్లో పౌడర్ రాసే అలవాటు ఉన్నట్లయితే, స్నానం చేసేప్పుడు తప్పకుండా ఆయా ప్రాంతాలను బాగా శుభ్రం చేయాలి. అలాగే రసాయనాలతో కూడిన పౌడర్లకు దూరంగా ఉండండి. చర్మం చాలా సున్నితమైనది. కాబట్టి, బేబీ పౌడర్ రాసుకోవడం ఒక్కటే ఉత్తమ మార్గం. 


చర్మవ్యాధి నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పౌడర్ అతిగా వాడకం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. 


☀ చర్మం మూలల్లో పౌడర్ నిల్వ ఉంటే అక్కడ అట్టలా పేరుకుపోతుంది. దానివల్ల గజ్జి తదితర అంటువ్యాధులు ఏర్పడవచ్చు.   
☀ టాల్కమ్ పౌడర్‌లు చర్మంపై ఉండే స్వేద రంథ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల దద్దుర్లు అధ్వాన్నంగా మారవచ్చు. లేదా కొత్తవి ఏర్పడవచ్చు.
☀ కొన్ని పౌడర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణమయ్యే ఆస్బెస్టాస్ ఉంటుంది.
☀ పౌడర్లలో ఉండే రసాయనాల వల్ల మహిళల్లో అండాశయ క్యాన్సర్ ఏర్పడవచ్చు. 
☀ జననేంద్రియ ప్రాంతాల్లో టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల అక్కడి చర్మం పొడిబారే అవకాశం ఉంది. 
☀ మర్మాంగాల వద్ద పౌడర్ రాయడం వల్ల గర్భాశయ క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. 
కొసమెరుపు ఏమిటంటే.. ఏ అధ్యయనం, వైద్య నిపుణులు టాల్కమ్ పౌడర్లు వాడొద్దని చెప్పలేదు. మితంగా మాత్రమే వాడాలని, రసాయనాలు లేని పౌడర్లను మాత్రమే వాడాలని సూచించారు. 


Also Read: టమోటాలతో రష్యా డ్రోన్‌ను కూల్చేసిన ఉక్రేయిన్ మహిళ, ఇదే కదా స్త్రీ శక్తి అంటే!


గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఈ కథనంలోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 


Also Read: జపాన్‌లో ముక్కలైన వెయ్యేళ్ల ‘కిల్లింగ్ స్టోన్’, 9 తోకల నక్క విడుదల! రష్యా-ఉక్రేయిన్ పోరుతో లింకేంటీ?