ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Governament ) నిబంధనల ప్రకారమే అప్పులు చేస్తోందని వాటిని పేదల ఖాతాల్లోకి వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. తెలుగుదేశం ( TDP ) పార్టీ హయాంలో చేసిన అప్పులు అవినీతి కారణం టీడీపీ వారి జేబుల్లోకి వెళ్లాయని.. తాము మాత్రం అప్పులు చేసి జనం ఖాతాల్లో వేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వ అప్పులపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ పరిమితి దాటి అప్పులు చేసిందంటూ చేస్తున్నవిమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
బాలకృష్ణ డైలాగ్స్‌తో అసెంబ్లీలో టీడీపీని ఏకేసిన సీఎం జగన్, ఆ బ్యాచ్‌కు ఎసిడిటీ బాగా పెరిగిందని సెటైర్లు
గతంలో ఏపీకి ఉన్న అప్పుల వివరాలను జగన్ సభకు వివరించారు. 2014 నాటికి రూ. లక్షా 20వేల 500 కోట్ల అప్పులు రాష్ట్రానికి వచ్చాయని... చంద్రబాబు సీఎంగా దిగిపోయే సమయానికి అంటే 2019 నాటికి ఆ అప్పులు రూ., 2, 68,225 కోట్లకు చేరాయన్నారు. అదే సమయంలో బకాయిలు రూ. 39వేల కోట్లు ఉన్నాయన్నారు. ఇక ప్రభుత్వ గ్యారెంటీ మీద అప్పులు 2014లో రూ. 14, 028కోట్లు ఉంటే... చంద్రబాబు దిగిపోయే సమయానికి రెట్టింపు అయ్యాయన్నారు. అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై అప్పులు విపరీతంగా చేశారని.. ఆ అప్పుల భారారాన్ని ప్రస్తుత ప్రభుత్వంపై వేసి విమర్శలు చేస్తున్నారన్నారు.,
తాము చేసే అప్పు పేదవాళ్లకు వెళ్తోందన్నారు సీఎం జగన్. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఎఫ్‌ఆర్‌బీఎం ( FRBM ) పరిమితి దాటలేదని.. కానీ చంద్రబాబు ( Chandrababu ) ప్రభుత్వం ప్రతీ ఏడాది నిబంధనలను దాటి రుణాలుతీసుకుందన్నారు. ఇలా చేసినందునే ఇప్పుడు ప్రబుత్వానికి రూ. 16,419కోట్ల రుణం కోత పెట్టారన్నారు. దీని కోసం కేంద్రంతో యుద్దం చేయాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు పాపాలే మనల్ని వెంటాడుతున్నాయని అసెంబ్లీలో జగన్ విమర్శించారు. అప్పులు చేసిన చంద్రబాబు కనీసం పేదల సంక్షేమానికి కూడ ఆ నిదులను కేటాయించలేదని జగన్ అన్నారు.
గత ప్రభుత్వంలోచేసిన అప్పుల లెక్కలను వివరించిన సీఎం జగన్ ఈ ప్రభుత్వంలో గత మూడేళ్ల కాలంలో చేసిన అప్పుల వివరాలను వెల్లడించలేదు. గత ప్రభుత్వం హయంలో ఆర్బీఐ అప్పులు.. కార్పొరేషన్ల అప్పులు.. విద్యుత్ సంస్థల అప్పులు.. భూములు తాకట్టు పెట్టిన అప్పులు ఇలా మొత్తం వివరించారు కానీ ప్రస్తుతం చేసిన అప్పులు వివరించకపోవడంతో ఎవరెక్కువ అప్పులు చేశారన్నదానిపై అధికారిక సమాచారం లేనట్లయింది.