Realme 9 Series: రియల్‌మీ 9 5జీ (Realme 9 5G), రియల్‌మీ 9 5జీ ఎస్ఈ (Realme 9 5G SE) స్మార్ట్ ఫోన్లు మనదేవంలో లాంచ్ అయ్యాయి. వీటిలో వెనకవైపు 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై రియల్‌మీ 9 పనిచేయనుంది. ఇక రియల్‌మీ 9 5జీ ఎస్ఈలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ రెండిట్లోనూ 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ అందించారు. వీటిలో 5జీ పవర్ సేవింగ్ ఫీచర్లు కూడా అందించారు.


రియల్‌మీ 9 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గా నిర్ణయించారు. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐల క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభించనుంది. అంటే రూ.13,499కే ఈ ఫోన్ దక్కించుకోవచ్చన్న మాట. మీటియోర్ బ్లాక్, స్టార్ గేజ్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం, రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


రియల్‌మీ 9 5జీ ఎస్ఈ ధర
ఇందులో కూడా రెండు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.22,999గా నిర్ణయించారు. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐల క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించనుంది. అజూర్ గ్లో, స్టారీ గ్లో రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం, రిటైల్ స్టోర్లలోనే ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది. మార్చి 14వ తేదీ నుంచి వీటి సేల్ జరగనుంది.


రియల్‌మీ 9 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ... పీక్ బ్రైట్‌నెస్ 600 నిట్స్‌గానూ ఉంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా 11 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవడానికి మైక్రో ఎస్‌డీ కార్డును అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 188 గ్రాములుగా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు మోనోక్రోమ్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, మాక్రో కెమెరాలు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సెలరోమీటర్ ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.


రియల్‌మీ 9 5జీ ఎస్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ఇందులో ర్యామ్‌ను 13 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... ఇందులో కూడా మోనోక్రోమ్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం కూడా రియల్‌ మీ 9 5జీ తరహాలోనే 16 మెగాపిక్సెల్‌గా ఉంది.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W క్విక్ చార్జ్ సపోర్ట్‌ను ఇది అందించనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 199 గ్రాములుగా ఉంది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?