ఉత్తర్‌ప్రదేేశ్‌లో విజయంతో బీజేపీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ విజయానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదినాథ్‌కు దక్కుతుందని చెబుతోంది.
ఉత్తరప్రదేశ్‌లో బిజెపి మరో అద్భుతమైన విజయం దిశగా పయనించడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా చేయనున్నట్టు సమాచారం. మార్చి 18 నుంచి 20 మధ్య ఆదిత్యనాథ్‌ను బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించనున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోరఖ్‌పూర్ అర్బన్‌లో ముందంజలో ఉన్నారు. కేశవప్రసాద్ మౌర్య కూడా ముందంజలో ఉన్నారు. భారీ విజయం సాధిస్తుందన్న ఆనందాన్ని ట్విట్టర్‌లో కేశవప్రసాద్ పంచుకున్నారు.
ప్రజాస్వామ్యం గెలిచిందని... గూండాయిజం ఓడిపోయిందని ఆయన మౌర్య ట్వీట్ చేశారు.
మరోసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీ చరిత్ర తిరగరాయనుంది. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిసారిగా వరుసగా ఓ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తోంది.