పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆమ్‌ఆద్మీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. అధికార కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదు.
ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఆమ్‌ఆద్మీ పార్టీ మెజార్టీ మార్క్ ఇప్పటికే దాటేసింది.
ఆప్: 88
కాంగ్రెస్: 13
శిరోమణి అకాలీ దళ్+: 10
భాజపా+: 5
ఇతరులు: 1
ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉండటంతో సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నివాసం వద్ద సందడి వాతావరణం ఉంది. పార్టీ కార్యకర్తలు జిలేబీలు సిద్ధం చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ధూరీ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
సీఎం సారు వెనుకంజ
కాంగ్రెస్‌కు మాత్రం పంజాబ్ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు స్థానాలు చమ్‌కౌర్ సాహెబ్, భదౌర్ స్థానాల్ వెనుకంజలో ఉన్నారు.
అమృత్‌సర్ ఈస్ట్ నుంచి పోటీకి దిగిన పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ లీడ్‌లో ఉన్నారు.
మరోవైపు శిరోమణి అకాలీ దళ్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్.. కూడా వెనుకంజలో ఉన్నారు. ఆయన కుమారుడు ఎస్‌ఏడీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ట్రయలింగ్‌లో ఉన్నారు. లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా వెనుకంజలో ఉన్నారు.