Viral Video : డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు యువతుల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.  ఈ కేసులో అమ్మాయిలిద్దరూ రోడ్డుపై ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం కనిపించింది. వారిద్దరూ తమ బాయ్ ఫ్రెండ్ గా భావించే ఓ వ్యక్తి గురించి ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది.


మద్యం, గంజాయికి అలవాటై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నవాళ్లు కొందరైతే.. ప్రేమ పేరుతో మోసపోయే వాళ్లు, మోసగించే వాళ్లు మరికొంతమంది. ఇంకొందరేమో అసలు తామేం చేస్తున్నారో కూడా మరచి ప్లేస్ తో సంబంధం లేకుండా ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోను చూసిన జనాలు స్పందించకుండా ఉండలేకపోతున్నారు. 


Also Read : Chattisgarh: మంత్రగాడి మాట విని బతికున్న కోడిపిల్లను మింగేశాడు - ఊపిరాడక ప్రాణాలు వదిలాడు, ట్విస్ట్ ఏంటంటే? 


 ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్న  వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకట్టు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం చూడవచ్చు. రోడ్డుపై చెంపదెబ్బ కొట్టడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. పక్కనే ఉన్న వ్యక్తులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వారిద్దరూ తమ గొడవను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని వినోదం అని పిలుస్తుంటే మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్‌నారు. ఈ విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఓ కుర్రాడితో స్నేహానికి సంబంధించిన వివాదమే గొడవకు కారణమని చెబుతున్నారు. ఈ సంఘటన ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాకుండా యువ తరం ప్రవర్తనపై ప్రశ్నలను కూడా లేవనెత్తింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు.






సోషల్ మీడియా యూజర్లు ఏమంటున్నారంటే..


ఈ మొత్తం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సోషల్ మీడియా యూజర్ల నుంచి వివిధ రకాలైన రియాక్షన్స్ వచ్చాయి. వారిపై పోలీసులు కేసు పెడతారో లేదో ఇప్పుడు చెప్పాలంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.  మన అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువ అని ఎవరో బ్రో అంటూ మరొకరు సటైరికల్ కామెంట్ చేశారు.  


గతంలోనూ..


గతంలోనూ ఈ తరహా సంఘటనలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. తమ లవర్ కోసం పోటీపడి మరీ కొట్టుకోవడం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. కొందరు దీన్ని వింతగా చూస్తే, మరికొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరేమో వినోదంలా ఫీలయ్యారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు బయటికొచ్చినప్పుడే.. అసలు ఇలాంటి మనుషులు ఉన్నారేంట్రా అనిపిస్తుందంటున్నారు మరికొందరు.


Also Read: Viral Video : ఈ కంపెనీలో బాస్ వస్తున్నాడంటే చాలు.. ఉద్యోగులు ఈ పని చేయాలట