Andhra Pradesh High Court Decision On Helmet: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్‌ లేకుండా డ్రైవ్ చేసి జూన్ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషయంపై హైకోర్టు సీరియస్ అయింది. మోటార్ వాహనాల చట్టం అమలు చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. సిసి కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేయాలని సూచించింది. 


హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సంగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. పోలీసులు నేరుగా రోడ్లపై ఉంటే నేరాల సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడింది. అక్కడే హెల్మెట్‌ ఉందా లేదా చూసి రికార్డుల తనిఖీ అన్ని జరిగిపోతాయన్నారు.  


Also Read: కాకినాడలో లేత దొంగ - బొమ్మ తుపాకీతో బెదిరించి తనిష్క్‌లో బంగారం కొట్టేశాడు కానీ ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు !


రాష్ట్రంలో 99 శాతం మంది హెల్మెట్ లేకుండానే వాహనాలు నడుపుతున్నారని ఇది ెంత మాత్రం క్షేమం కాదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాహనాలు నడిపే వ్యక్తి కాకుండా వెనుకున కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని కోర్టు ఆదేశించింది. అలాంటి చేయని వారిపై మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.కొందరు సంవత్సరాలుగా చలాన్లు కట్టలేదని వారిపై సెక్షన్ 167, సెక్షన్ 206 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి వాహనాలను సీజ్ చేసి లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించింది.  


ఒక్క హెల్మెట్ విషయమే కాకుండా ఆటోల్లో కూడా పరిమితికి మించి జనాలను ఎక్కిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడింది కోర్టు. ఇలాంటి చట్ట విరుద్దమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ప్రచార మాధ్యమాల్లో యాడ్లు, సైన్‌బోర్డుల ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పింది. చలాన్లు ెలా వేస్తున్నారు? ఎలా వసూలు చేస్తున్నారు? చట్టం కఠినంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలేంటీ? రోడ్లపై తనిఖీలకు ఏర్పాటు చేసిన టీంలు ఎన్ని? అన్ని వివరాలతో అఫిడవిట్ వేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం విచారరణ మూడు వారాలు వాయిదా వేసింది.  


 Also Read: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే