APSLPRB Physical Events Call Letters: ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించిన దేహదారుఢ్య (ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్) పరీక్షల కాల్‌లెటర్లు డిసెంబరు 18న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్‌లెటర్లను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసి కాల్‌లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 29 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం స్టేజ్‌-2 పీఎంటీ/ పీఈటీ పరీక్షలు డిసెంబర్‌ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94414 50639 లేదా 91002 03323 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.


కానిస్టేబుల్ పీఎంటీ/పీఈటీ కాల్‌లెటర్ల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో 6,100 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తదుపరి దశకు మొత్తం 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలు నిలిచిపోయాయి. అయితే అప్పటి నుంచి పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఫిజికల్‌ టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు. దాదాపు మూడేళ్లగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ తాజాగా ఫిజికల్ ఈవెంట్ల తేదీలను ఖరారుచేసింది. 


అక్కడే మొదలైన సమస్య..
ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లో సివిల్‌ హోంగార్డులకు 15 శాతం, ఏపీఎస్పీ హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ నేపథ్యంలో కొంద‌రు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అప్పటినుంచి నియామక ప్రక్రియ ఆగిపోయింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం న్యాయనిపుణుల సహకారంతో న్యాయమైన చిక్కులను తప్పించి.. ఆగిపోయిన కానిస్టేబుల్ నియామకాలను ముందుకు తీసుకెళుతోంది. ఈ నేఫథ్యంలో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధిచిన కాల్‌లెటర్లను పోలీసు నియామక మండలి తాజాగా విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహించడానికి ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఏర్పాట్లు చేస్తోంది.


🔰  ఫిజికల్ ఈవెంట్లు ఇలా.. (PET)


➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.



🔰 మెయిన్ పరీక్ష విధానం: 


➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.


➨  సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.


➨  ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.


కానిస్టేబుల్ పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..