శీతాకాలం వస్తే ఉదయాన్నే లేవాలని కూడా సాధారణంగా అనిపించదు. అలాంటిది చలికి ఎముకలు కొరుకుతోన్న చలించకుండా దేశ సరిహద్దుల్లో జవాన్లు పహారా కాస్తుంటారు. సరిహద్దుల్లో శత్రువులు, ఉగ్రవాదులతోనే కాకుండా ప్రతికూల వాతావరణంతో వాళ్లు పోరాడుతుంటారు. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో మైనస్ డిగ్రీల వాతావరణంలో ఐటీబీపీ జవాన్లు పహారా కాస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సలాం సైనిక
మోకాళ్లకు పైగా లోతులో దిగపడిపోయే మంచులో అడుగు తీసి అడుగు ముందుకేయలేని స్థితిలో కూడా మన కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు జవాన్లు. ఆ సైనికుల కష్టం చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. హిమాలయాల్లో ఐటీబీపీ జవాన్లు చైనా సరిహద్దు సమీపంలో ఇలా పహారా కాస్తున్నారు.
ఇండో టిబెటన్–బోర్డర్ పోలీసులు ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు. 15 వేల అడుగుల ఎత్తులోని మంచు ప్రాంతంలో ఐటీబీపీ జవాన్లు కాపలా కాయాలి. అతి తక్కువ ఉష్ణోగ్రతలో, మోకాళ్ల లోతు మంచులో మొక్కవోని దీక్షతో వీళ్లు విధులు నిర్వహిస్తున్నారు.
ఒక్క అడుగు ముందుకు వేయడానికి వాళ్లు పడుతున్న కష్టాన్ని వీడియోలో చూసి నెటిజన్లు 'జై జవాన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. భుజాన తుపాకులు మోస్తూ కర్ర లాంటి వస్తువును ఊతంగా చేసుకుని, బలమైన రోప్ పట్టుకుని ముందుకు సాగుతున్నారు జవాన్లు. సరిహద్దులోని కీలక ప్రదేశాల్లో జవాన్లు ఇలా పెట్రోలింగ్ చేస్తుంటారు.
Also Read: Private Sector Reservation: ప్రైవేట్ ఉద్యాగాల్లో స్థానికుల రిజర్వేషన్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
Also Read: Punjab Assembly 2022: 'నెహ్రూపై నిందలు ఎందుకు? ఏడున్నరేళ్లలో మీరు చేసిందేంటి?'