Punjab Assembly 2022: 'నెహ్రూపై నిందలు ఎందుకు? ఏడున్నరేళ్లలో మీరు చేసిందేంటి?'

ABP Desam   |  Murali Krishna   |  17 Feb 2022 04:23 PM (IST)

మోదీ సర్కార్ ఆచరిస్తోన్న విదేశాంగ, ఆర్థిక విధానాలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు.

మోదీపై మన్మోహన్ సింగ్ విమర్శలు

నకిలీ జాతీయవాదాన్ని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. దేశాన్ని విభజన రాజకీయాల వైపు భాజపా నడిపిస్తుందని విమర్శించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ తరఫున వర్చువల్‌గా ప్రచారం నిర్వహించారు.

ప్రధాని నరేంద్ర మోదీపై కూడా మన్మోహన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతి విషయానికి దేశ చరిత్రను, పూర్వ ప్రధానులను నిందించడం ప్రధాని మోదీకి తగదని మన్మోహన్ హితవు పలికారు.

రాజకీయ లబ్ధి కోసం మేం ఎన్నడూ ప్రజల్ని వేరు చేయలేదు. నిజాన్ని దాయాలని ప్రయత్నించలేదు. ప్రధాని స్థానాన్ని లేదా దేశ చరిత్రను ఎన్నడూ తప్పు పట్టలేదు. కానీ ప్రస్తుతం ప్రజలను విభజిస్తున్నారు. మోదీ సర్కార్ అవలంబిస్తోన్న నకిలీ జాతీయవాదం దేశానికి చాలా ప్రమాదకరం. వీళ్లు చెప్పే జాతీయవాదం.. ఆనాడు బ్రిటీషర్లు చేసిందే. విభజించు-పాలించు అనే నినాదాన్ని మోదీ సర్కార్ పాటిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరుస్తోంది.                                                          - మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని

వాళ్లకు ఏం తెలీదు

ప్రస్తుత మోదీ సర్కార్‌కు ఆర్థిక పాలసీలు, విదేశాంగ విధానాలపై ఎలాంటి అవగాహన లేదని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. మన దేశ సరిహద్దుల్లో చైనా వచ్చి కూర్చుంటే ఆ విషయాన్ని బయటకు రాకుండా చూసేందుకు సర్కార్ ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.

కరోనా సంక్షోభంపై

కరోనా సంక్షోభాన్ని మోదీ సర్కార్ ఎదుర్కొన్న తీరును కూడా మన్మోహన్ విమర్శించారు.

కరోనా సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు పాలసీలను అమలు చేసింది. ఓవైపు పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఏడున్నర ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సామాన్యుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించలేక నెహ్రూపై నిందలు వేస్తోంది.                                                          -  మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని

Also Read: Private Sector Reservation: ప్రైవేట్ ఉద్యాగాల్లో స్థానికుల రిజర్వేషన్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

Also Read: UP Wedding Tragedy: పెళ్లింట తీవ్ర విషాదం- బావిలో పడి 13 మంది మృతి

Published at: 17 Feb 2022 03:55 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.