ఉత్తర్​ప్రదేశ్‌లో ఘోర విషాదం జరిగింది. ఖుషీనగర్​లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో బావిలో పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వివాహానికి ముందు నిర్వహించిన హల్దీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.







తీవ్ర విషాదం


పరేమేశ్వర్ కుష్వాహా అనే వ్యక్తికి సంబంధించిన వివాహ వేడుక నెబువా నౌరాంగియాలో నిర్వహించారు. హల్దీ కార్యక్రమానికి భారీగా అతిథులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో 50-60 మంది మహిళలు, బాలికలు ఓ బావి దగ్గర వేడుకలు చేసుకున్నారు.


ఇనుప కంచెతో మూసేసిన ఆ పాడుబడ్డ బావిపై కొంతమంది నిల్చున్నారు. అయితే బరువు ఎక్కువ కావడం వల్ల కంచె విరిగిపోయింది. కొంతమంది బావిలో పడిపోయారు. వెంటనే చుట్టూ ఉన్నవారంతా వచ్చి వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో 13 మంది మరణించారని వైద్యులు నిర్ధరించారు.


ప్రధాని విచారం







ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


Also Read: Private Sector Reservation: ప్రైవేట్ ఉద్యాగాల్లో స్థానికుల రిజర్వేషన్‌పై సుప్రీం కీలక ఆదేశాలు


Also Read: Infosys Recruitment: గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్, ఈ ఏడాది 55 వేల మందికి ఉద్యోగాలు