తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 317 అనేక సమస్యలకు కారణం అవుతోంది. ఓ వైపు ఉద్యోగులు కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొంత మంది గుండెలు ఆగిపోతున్నాయి. దీంతో ఇది రాజకీయ అంశం అయిపోయింది.  అసలు జీవో నెం.317లో ఏముంది ? ఉద్యోగుల అభ్యంతరాలు ఏమిటి? ప్రభుత్వం ఏమంటోంది ? 


Also Read: రాఘవ కేసులో పోలీసులపై ఒత్తిడి? రౌడీషీట్‌ ఓపెన్ చేయకుండా ఆడ్డుకుంటుందెవరు?


అసలు జీవో నెం.317 ఎందుకంటే ?


తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల ఉద్యోగులను 32 కొత్త జిల్లాలకు కేటాయింపులు చేయాల్సి ఉంది.  ఇలా చేయడానికి ప్రభుత్వం జీవో 317ను విడుదల చేసింది.  స్థానికేతర కోటాలో చేరినవారైనప్పటికీ.. ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్‌ ప్రకారం ఉద్యోగులకు జిల్లాను కేటాయించాల్సి ఉంది. సాధారణంగా బదిలీ అయితే కొన్నేళ్లకు మళ్లీ కోరుకున్న ప్రాంతానికి రావొచ్చు. కానీ, కొత్త జిల్లాల వారీగా కేటాయింపులు శాశ్వతం. అంటే సర్వీస్​అంతా ఉద్యోగులకు కేటాయించిన జిల్లాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత జిల్లాను వదిలి వెళ్లాల్సి వస్తోందనే బాధతో స్థానికత ఆధారంగానే జిల్లాలకు కేటాయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జీవోను వ్యతిరేకిస్తున్నాయి. 


Also Read: ఆ బదిలీల జీవో వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టింది ! నిజామాబాద్ జిల్లాలో రోడ్డున పడ్డ పంచాయతీ కార్యదర్శలు...


స్థానికతను కాకుండా సీనియారిటీని బట్టి బదిలీలు !


కొత్త జిల్లాల స్థానికతను పక్కనబెట్టి సీనియారిటీకే ప్రాధాన్యం ఇస్తూ ఉపాధ్యాయుల బదిలీలను చేయడం వివాదాస్పదం అవుతోంది. తెలంగాణలో మొత్తం వర్కింగ్​టీచర్లు ఒక లక్ష తొమ్మిది వేల మంది ఉన్నారు. కాగా ఇందులో దాదాపు 22 వేల మందికి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీలు జరిగాయి. ఎన్నో ఏండ్లుగా స్థానికంగా ఉన్నవారిని వందల కిలోమీటర్ల దూరం పంపడంతో మహిళా టీచర్లకు ఇబ్బందిగా మారింది. దీనివల్ల కుటుంబాన్ని, పిల్లలను వదిలి వెళ్లాల్సిరావడం, వృద్ధులైన కన్న తల్లిదండ్రులు, అత్తా మామలకూ దూరంగా వెళ్లాల్సి ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. 


Also Read: అర్ధరాత్రి ఆర్టీసీ ఎండీకి ట్వీట్ చేసిన యువతి.. వెంటనే సజ్జనార్ స్పందన, శభాష్ అంటున్న నెటిజన్లు!


పెరుగుతున్న ఉద్యోగుల మరణాలు !


317 జీవో కారణంగా పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. సొంత జిల్లాను విడిచి మరో జిల్లాకు బదిలీపై వెళ్లాల్సి వస్తోందని మనోవేదనకు గురై గుండెపోటుతో ఆరుగురు మృతిచెందారు. మరో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నాని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. తొమ్మిది మందిలో ఆరుగురు టీచర్లున్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కార్​తీసుకొచ్చిన జీవో 317 ద్వారా స్థానికతను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


Also Read: పెంచిన ఎరువుల ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్త ఆందోళన.. కేంద్రానికి కేసీఆర్ హెచ్చరిక !


ఉద్యోగసంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్లేమిటి?


ప్రస్తుతం ఈ సమస్య రాజకీయం అయింది.  బదిలీల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసి.. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి... స్థానికత ప్రాతిపదకన బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  వీరికి రాజకీయ పార్టీలు మ్దదతు పలుకుతున్నాయి. పదోన్నతలు కల్పించిన అనంతరం ఏర్పడిన ఖాళీల్లో నష్టపోయిన ఉపాధ్యాయులను భర్తీ చేసి న్యాయం చేయాలని..   బ్లాక్​చేసిన 13 జిల్లాల వారికి కూడా అవకాశం కల్పించాలని.. . జిల్లా స్థాయిలో జరిగిన తప్పులపై ఆయా జిల్లాల కలెక్టర్లు సరిచూసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.  


Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !


పరిస్థితిని అంచనా వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం !


రాజకీయంగా కూడా సున్నితంగా మారినప్పటికీ ఇంకా తెలంగామ ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.   ఉన్నతాధికారులు సమస్యలపై పరిశీలన జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసినట్లుగా బదిలీలు నిలిపివేయడం సాధ్యం కాదన్న అభిప్రాయం ప్రభుత్వంలో వినిపిస్తోంది.


Also Read: మంత్రి హరీశ్ రావును కలిసిన బాల‌కృష్ణ.. ఆ విషయంలో సాయం కోసం విజ్ఞప్తి



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి