కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలను పెంచడంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలను పెంచడంపై కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఎరువుల ధరలను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం వ్యవసాయ ఖర్చులను రెట్టింపు చేయడం దుర్మార్గమని కేసీఆర్ విమర్శించారు.
Also Read: ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !
కరెంట్ మోటర్లతో బిల్లులు వసూలు చేయడం, ధాన్యం కొనకుండా ఎరువుల ధరలు పెంచడం కుట్రగా కేసీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు. వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసేలా కేంద్రం నిర్ణయాలను తీసుకుంటుందన్నారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తుందని బీజేపీపై మండిపడ్డారు. ఎరువుల ధరలు తగ్గించేలా పోరాటం చేస్తామని.. దేశ వ్యాప్తంగా ఆందోళనలను చేపడుతామని కేసీఆర్ ప్రకటించారు.
బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి విస్తరించకుండా కేంద్రం నాన్చుతోందని ఆరోపించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ మోటార్ల వద్ద మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేసే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు సీఎం కేసీఆర్. వ్యవసాయాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టె చర్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
Also Read: ప్రగతి భవన్‌కు బీహార్ ప్రతిపక్ష నేత.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కీలక చర్చలు ...
అంతేకాకుండా పెంచిన ఎరువుల ధరలు తగ్గించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసి కేంద్రం మెడలు వంచుతామన్నారు. కేంద్రం రైతుల వ్యతిరేక నిర్ణయాలపై కేసీఆర్ ఇటీవలి కాలంలో తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా స్వరం పెంచారు. ఆ తర్వాత కేంద్రం ఆ చట్టాలను ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఎరువుల ధరల పెంపు అజెండాగా ఆయన దేశ వ్యాప్తంగా ఉద్యమానికి ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: మంత్రి హరీశ్ రావును కలిసిన బాలకృష్ణ.. ఆ విషయంలో సాయం కోసం విజ్ఞప్తి