నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నేడు (డిసెంబరు 12) హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద హడావుడి నెలకొంది. రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి చేరుకున్న ఏపీ సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. విచారణకు రావాలని రఘురామకు ఈ నోటీసులు ఇవ్వాలని వచ్చినట్లు తెలుస్తోంది. రేపే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, రేపు నరసాపురం వెళ్తున్నట్లు ఇప్పటికే రఘురామ ఇప్పటికే ప్రకటించారు. రెండు రోజులపాటు తన సొంత నియోజకవర్గం నరసాపురంలో పర్యటిస్తానని రఘురామ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగను తన ఊరిలోనే జరుపుకుంటానని చెప్పారు. 


ఈ పరిస్థితుల్లో రఘురామరాజుకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన విషయం సంచలనం రేపింది. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ గతంలో రఘురామపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆ కేసులోనే విచారణకు రావాలని ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: Hyderabad: ఎర్రగడ్డ సంతలో కత్తులు కొని మాజీ భార్యపై ఘాతుకం.. నడిరోడ్డుపైనే కత్తిపోట్లు


అయితే, రఘురామ బయటకు రాకపోవడంతో సీఐడీ అధికారులు ఇంటి బయట వేచి ఉన్నారు. విచారణకు హాజరు కావాలని.. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని సీఐడీ అధికారులు చెబుతున్నప్పటికీ ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నరన్న విషయంపై వారు స్పష్టంగా చెప్పడం లేదు. కాగా, ఎంపీ రఘురామను అరెస్టు చేయద్దని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారం.. ఇప్పుడు ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం లేదు.


ఆ అధికారి ఓ ఉన్మాది: స్పందించిన రఘురామ


ఇన్ని రోజులు ఆ కేసు గురించి పట్టించుకోకుండా పండుగ రోజుల్లో విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం ఏమిటని రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ అధికారులపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వంపై కుట్ర పూరితంగా విమర్శలు చేస్తున్నారని ఏపీసీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి రాజద్రోహం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఆ తర్వాత ఎప్పుడూ విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇవ్వలేదు. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి నలుగురు సీఐడీ అధికారుల బృందం వచ్చి.. గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇవాళ నోటీసులు ఇచ్చి.. రేపే విచారణ కావాలని హాజరు కావాలని అడగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో  17వ తేదీన విచారణకు రావాలని చెప్పారని రఘురామకృష్ణరాజు మీడియాకు చెప్పారు. సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని అని మండిపడ్డారు.


Also Read: Minister Perni Nani: మీకు సినిమా తప్ప వేరే యావ లేదా.. మంత్రి పేర్ని నాని అసహనం


Also Read: అది గుడ్ జోక్ కాదు... సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ! అయితే... ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు!