బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. బంజారాహిల్స్ పీఎస్ లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ పై నమోదైన కేసులో ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది. ఎంపీ అర్వింద్‌ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్టూన్ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో కార్టూన్ ఫొటో పోస్ట్ చేయడం క్రిమినల్ చర్య కాదని హైకోర్టు అభిప్రాయపడింది. విభిన్న గ్రూపుల మధ్య విధ్వేషాలు, రెచ్చగొట్టే పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదని ఎంపీ అర్వింద్‌ ను హైకోర్టు హెచ్చిరించింది. ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు ఆదేశించింది. 


Also Read: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెషన్... నాడే శిక్ష వేసి ఉంటే నేడు నాలుగు ప్రాణాలు దక్కేవి... రాఘవ వేధింపులపై మరో బాధిత కుటుంబం


అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దు


సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు హైకోర్టు సూచించింది. సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా కార్టూన్ పోస్టులు పెట్టారని ఎంపీ అర్వింద్‌పై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలన్న అర్వింద్ హైకోర్టును ఆశ్రయించారు. అర్వింద్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. 


Also Read: డయల్ 100కి కాల్ చేసిన యువకుడికి చేదు అనుభవం... ఆ యువకుడినే అదుపులోకి తీసుకున్న పోలీసులు...!


బొడిగె శోభకు హైకోర్టులో ఊరట


చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రూ.25 వేల పూచీకత్తుతో బొడిగె శోభను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్ష కేసులో కరీంనగర్‌ పోలీసులు బొడిగె శోభను అరెస్టు చేశారు. ఈ కేసులో కరీంనగర్ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో తన రిమాండ్‌ను రద్దు చేయాలని శోభ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారించిన హైకోర్టు.. శోభ రిమాండ్‌పై స్టే విధించింది. బొడిగె శోభ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కరీంనగర్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.


Also Read:  జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి