Top 5 Telugu Headlines Today 6 November 2023:
సీఎం కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం - సాంకేతిక లోపంతో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న టైంలో ఈ ఘటన జరిగింది. సీఎం కేసీఆర్ ఇవాళ నాలుగు ప్రాంతాల్లో సుడిగాలి ప్రచారం చేయనున్నారు. దేవరకద్ర, గద్వాల్, నారాయణ్‌పేట, మక్తల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజాశీర్వాద యాత్రలో పాల్గోనున్నారు. అందులో భాగంగా ముందుగా దేవరకద్ర వెళ్తున్న టైంలో కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలెట్ అప్రమత్తమైన పెను ముప్పును తప్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'ధర్మం కోసం పోరాడేది బీజేపీనే' - ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారన్న బండి సంజయ్
ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీ అని ఎంపీ, కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని చెప్పారు. తన నామినేషన్ సందర్భంగా కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణవ్యాప్తంగా రెపరెపలాడించానన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో ఈ 13న దీపావళి సెలవు దినం: ఏపీ సిఎస్.డా.కెఎస్.వజహర్ రెడ్డి
Deepavali Holiday 2023 in AP: అమరావతి: ఏపీ ప్రభుత్వం దీపావళి సెలవు ప్రకటించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 13వ తేదీని (సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలియజేశారు. ఈమేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఓ 2167 ద్వారా 13వ తేదిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీజేపీ, జనసేన పొత్తు టీడీపీ ఓట్ల కోసమేనా ? సీట్లు కేటాయించింది కూడా ఆ స్థానాల్లోనేనా!
తెలంగాణలో అసెంబ్లీ ప్రచారం ఊపందుకుంది. పార్టీలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతుంటే... కారుకు బ్రేకులు వేయాలని హస్తం పార్టీ ఎత్తులు వేస్తోంది. తెలంగాణ విజయం సాధించి..దక్షిణాదిన కాషాయ జెండాను రెపరెపలాండించాలని బీజేపీ పైఎత్తులు వేస్తోంది. కమలం పార్టీ, జనసేన పొత్తుపై తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జస్ట్ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. హిందూత్వవాది రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి