టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను టీజర్‌ను విడుదల చేశారు. ఇందులోని డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ దెబ్బతో రవితేజ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడటం ఖాయమనే టాక్ నడుస్తోంది.

   


ఆకట్టుకుంటున్న ‘ఈగల్’ టీజర్


ప్రస్తుతం ‘ఈగల్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పటికే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఆ వీడియోను బట్టి ‘ఈగల్’ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్నట్లు అర్థం అయ్యింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో రవితేజ గురించి ఒక్కొక్కరు చెప్పే విషయాలు ఆయను ఆకాశానికి ఎత్తేలా ఉన్నాయి. రవితేజ లుంగీ కట్టి, తుపాకీ పట్టి గతంలో ఎప్పుడూ లేనంత మాస్ గా కనిపించారు. యాక్ష‌న్ తో పాటు థ్రిల్లింగ్‌గా కొనసాగింది టీజర్. “కొండ‌లో లావాను కింద‌కు పిల‌వ‌కు. ఊరు ఉండ‌దు. నీ ఉనికి ఉండ‌దు” అంటూ ర‌వితేజ చెప్పిన  సాలిడ్ డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభం అవుతుంది. “అడ‌విలో ఉంటాడు. నీడై తిరుగుతుంటాడు. క‌నిపించ‌డు. కానీ వ్యాపించి ఉంటాడు” అంటూ ర‌వితేజ క్యారెక్ట‌ర్ గురించి శ్రీనివాస్ అవ‌స‌రాల ఇచ్చిన హైప్ టీజ‌ర్‌కు హైలైట్‌ అని చెప్పుకోవచ్చు. “ఇది విధ్వంసం మాత్ర‌మే, త‌ర్వాత చూడ‌బోయేది విశ్వ‌రూపం” అంటూ న‌వ‌దీప్ చెప్పిన డైలాగ్ మరింత ఆకట్టుకుంటోంది.  టీజ‌ర్ చివ‌ర‌లో రవితేజ గెటప్ వారెవ్వా అనిపిస్తోంది. ముఖంపై గాటు, నోట్లు చుట్టతో మరింత మాసీగా కనిపించాడు.   



సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్


‘ఈగల్’ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అందులో ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా, కావ్య థాపర్. మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘ధ‌మాకా’తో ర‌వితేజ‌కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ, ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘ఈగల్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.


రవితేజ రీసెంట్ గా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చారు. ద‌స‌రా కానుకగా ఈ  మూవీ విడుదల అయ్యింది. డైరెక్టర్ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ మూవీ స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ రూపొందింది. అయితే, భారీ అంచనాలు నడుమ రిలీజైన ఈ మూవీ ఆశించిన మేర థియేట్రికల్ రెవెన్యూ రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో గాయత్రీ భరద్వాజ్, నుపుర్ సనన్, అనుపమ్ ఖేర్ వంటి బాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు.  


Read Also: సోషల్ మీడియోలో రష్మిక వీడియో వైరల్, అమితాబ్ బచ్చన్ ఆగ్రహం, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్