Fake video of Rashmika Mandanna goes viral on internet: పెరుగుతున్న టెక్నాలజీతో లాభాలతో పాటు నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటున్నాయి. నిజమైన వీడియోలు, ఫోటోలు అని భ్రమపడేలా ఫేక్ ఫోటోలు, వీడియోలను (Deepfake Video) ఎడిట్ చేస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ అందుబాటులోకి వచ్చాక, పరిస్థితి మరింత చేదాటినట్లు కనిపిస్తోంది. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను ఇష్టారీతిన ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఏది నిజమైన వీడియోనో, ఏది ఫేక్ వీడియోనో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నకిలీవి నిజమని నమ్ముతున్నారు.
సోషల్ మీడియాలో రష్మిక వీడియో వైరల్
రీసెంట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ ధరించి, లిఫ్టులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో రష్మిక ఎప్పుడూ లేనంతగా అందాలు ఆరబోస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అయ్యారు. రష్మిక ఇలా ఎక్స్ పోజ్ చేయడం ఏంటి? ఇలా తయారై బయటకు రావడం ఏంటి? అయినా, రష్మిక వీడియో ఏదో తేడాగా ఉందే? అని నెటిజన్లను అనుమానం వ్యక్తం చేశారు.
ఫేక్ వీడియో కథ బయటపెట్టిన జర్నలిస్టు
చివరకు కొంత మంది ఇది ఫేక్ వీడియో అంటూ కామెంట్ పెట్టారు. కానీ, చూడ్డానికి నిజమైన వీడియో మాదిరిగానే కనిపించడంతో చాలా మంది రియల్ వీడియో అని భ్రమ పడ్డారు. చివరకు అభిషేక్ అనే జర్నలిస్టు ఇది ఫేక్ వీడియో అంటూ ఆధారాలతో సహా రుజువు చేశారు. ఈ వీడియోలో ఉన్న అసలు రష్మిక కాదని ఆయన తేల్చేశారు. ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు సంబంధించినదని వెల్లడించారు. ఆ వీడియోతో పాటు మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జారా వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసినట్లు వెల్లడించారు.
కఠిన చర్యలు తీసుకోవాలన్న అమితాబ్
ఈ ఫేక్ వీడియోపై రష్మిక అభిమానులతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ వీడియోపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. రష్మిక మాత్రం ఈ వీడియోపై ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తోంది. త్వరలో రణబీర్ తో కలిసి నటించిన ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు ‘పుష్ప2’లోనూ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలతో పాటు మరో 4 సినిమాల్లోనూ నటిస్తోంది.
Also Read: అందుకే రాహుల్ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial