KCR Helicopter Emergency Landing: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న టైంలో ఈ ఘటన జరిగింది.
సీఎం కేసీఆర్ ఇవాళ నాలుగు ప్రాంతాల్లో సుడిగాలి ప్రచారం చేయనున్నారు. దేవరకద్ర, గద్వాల్, నారాయణ్‌పేట, మక్తల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజాశీర్వాద యాత్రలో పాల్గోనున్నారు. అందులో భాగంగా ముందుగా దేవరకద్ర వెళ్తున్న టైంలో కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.
సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలెట్ అప్రమత్తమైన పెను ముప్పును తప్పించారు. వెంటనే మార్గ మధ్యలో దించేశారు. సీఎం దేవరకద్ర వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని తెలియగానే అధికారులు అప్రమత్తమయ్యారు. బీఆర్‌ఎస్ నేతలు కూడా అప్రమత్తమైన ఘటనపై ఆరా తీస్తున్నారు.