Telugu Headlines Today 28 June 2023: 
జులై 12న తెలంగాణకు రానున్న మోదీ- హైదరాబాద్‌లో రోడ్‌ షోతోపాటు బహిరంగ సభ
తెలంగాణలో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ విజయం కోసం ఎప్పుడో ప్లాన్స్‌ అమలు చేస్తున్నాయి. వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై మరింత ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే రాష్ట్రనాయకులను ఢిల్లీ పిలిచి మాట్లాడింది. ఇప్పుడు అగ్రనేతలు ఒక్కొక్కరుగా తెలంగాణలో పర్యటించబోతున్నారు. అందులో భాగంగా జులై 12 ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్నారు.  పూర్తి వివరాలు  


లారీ ఎక్కి తిడుతున్నాడు - పవన్‌, చంద్రబాబుపై జగన్ విమర్శలు !
అమ్మఒడి పథకానికి బటన్ నొక్కే సభలో పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ వాహనాన్ని లారీతో పోల్చారు.  దత్తపుత్రుడు.. ప్యాకేజీ స్టార్‌ ఇప్పుడు ఓ లారీ ఎక్కాడు. వారాహి అనే లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడని మండిపడ్డారు.  దత్తపుత్రుడిలా మనం బూతులు తిట్టలేం.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేమని చెప్పుకొచ్చారు.  పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకురాలేం. ఇవన్నీ దత్తపుత్రుడికే పేటెంట్ అని విమర్శించారు. టీడీపీ అంటే తినుకో.. దోచుకో .. పంచుకో అని పేరు చెప్పారు. ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే.. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని మండిపడ్డారు.  పూర్తి వివరాలు  


ఈటల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఆరా, ఎమ్మెల్యే ఇంటికెళ్లిన సీనియర్ ఐపీఎస్‌ అధికారి
భద్రతకు ముప్పు ఉందని ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఈటల అంటే.. తన భర్తను చంపే కుట్ర జరుగుతోందన్నారు. దీని కోసం సుపారీ కూడా ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ కేంద్రంగానే వాళ్లీ ఆరోపణలు చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిపై తీవ్ర ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే ఈటల భద్రతపై రివ్యూ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.  వెంటనే కలుగుజేసుకున్న డీజీపీ... మేడ్చల్ డీసీపీ సందీప్‌రావుకు స్పెషల్ టాస్క్ ఇచ్చారు.  పూర్తి వివరాలు  


బీజేపీ బీ టీం బీఆర్‌ఎస్‌, ఒవైసీ ప్లేస్‌లో కేసీఆర్‌ను పంపారని సామ్నా ఆగ్రహం
మహారాష్ట్రలో పార్టీని విస్తరించే పనిలో కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటికే చాలా సార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. రీసెంట్‌గా రెండు రోజల పాటు అక్కడ భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. మంగళవారం భారీ బహిరంగ సభను పండరీపూర్‌లో పెట్టారు. అక్కడ మాట్లాడిన కేసీఆర్‌ రాజకీయపార్టీలపై తీవ్రవిమర్శలు చేసారు. దీనిపై శివసేన మండిపడింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలతో కాలమ్‌ రాసింది. ఒవైసీ తర్వాత హైదరాబాద్ నుంచి మరో బృందాన్ని మహారాష్ట్రకు పంపించారని కామెంట్ చేసింది. పూర్తి వివరాలు  


మన పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి- అమ్మఒడి పథకం నిధుల విడుదల సందర్భంగా జగన్ ఆకాంక్ష
2022 -23 విద్యాసంవత్సరానికి అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వరుసగా నాలుగో ఏడాది బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కార్యక్రమంలో జగన్  42.61లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,392.94 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగానే ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ పది రోజుల పాటు పండుగల జగనన్న అమ్మ ఒడి కొనసాగుతుందని తెలిపారు.  పూర్తి వివరాలు  
Join Us on Telegram: https://t.me/abpdesamofficial