Stock Market @12 PM, 28 June 2023:


స్టాక్‌ మార్కెట్లు బుధవారం దూసుకెళ్తున్నాయి. ఆల్‌టైమ్ హై దిశగా సాగుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 144 పాయింట్లు పెరిగి 18,961 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 465 పాయింట్లు పెరిగి 63,881 వద్ద కొనసాగుతున్నాయి. మీడియా తప్ప అన్ని రంగాల సూచీలు అరశాతానికి పైగా పెరిగాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 63,416 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 63,701 వద్ద మొదలైంది. 63,554 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,948 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 465 పాయింట్ల లాభంతో 63,881 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 18,817 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,908 వద్ద ఓపెనైంది. 18,861 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,982 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 144 పాయింట్ల లాభంతో 18,961 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,419 వద్ద మొదలైంది. 44,163 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,421 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 214 పాయింట్లు పెరిగి 44,335 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 44 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటా మోటార్స్‌, ఎస్బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అపోలో హాస్పిటల్స్‌, కొటక్‌ బ్యాంక్‌, విప్రో షేర్లు నష్టపోయాయి. మీడియా మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.58,960గా ఉంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.71,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.340 తగ్గి రూ.24,190 వద్ద ఉంది. 


Also Read: ITR ఫైలింగ్‌ ముందే పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయండి, ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.