AP Telangana News Today: మిగిలింది వారం రోజులే ఊరూ వాడా చుట్టేద్దాం- పీక్స్‌కు చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం
తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడింది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు పార్టీలు, పార్టీల అగ్రనేతలు సంసిద్ధమవుతున్నారు. ఊరూవాడా చుట్టేసి ఓటర్ల మదిలో ముద్రపడేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకొని వీక్‌గా ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. నేతలకు ఫోన్లు చేసి ఉన్న సమస్యలు తెలియజేస్తూ కేడర్‌ను కలుపుకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
చంద్రబాబుకు ప్రజల్లోకి వెళ్లేందుకు అడ్డంకులన్నీ తొలిగాయా ? - 29 నుంచి ఏం చేయబోతున్నారు ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో కనీస ప్రాథమిక ఆధారాలను కూడా సీఐడీ చూపించలేకపోయిందని స్పష్టం చేసింది. ఆరోగ్య కారణాలతో ఇచ్చిన మధ్యంతర బెయిల్ సందర్భంగా పెట్టిన షరతులను 29వ వరకూ కొనసాగిస్తూ తర్వాత వాటినీ తొలగించారు. వీటిపై సీఐడీ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేసింది. విచారణకు వచ్చినా బెయిల్ రద్దు చేయడం అనేది ఉండకకపోవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Telangana Elections 2023 : కాంగ్రెస్ నాడు - నేడు ! రేవంత్ రెడ్డితోనే మార్పా ?
తెలంగాణ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలిచిందని దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ బహిరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదని సచ్చేది లేదని కేసీఆర్ కూడా బహిరంగసభల్లో అంటున్నారు. అసలు కాంగ్రెస్ గెలుపు అనే మాట రెండు పోటీ పార్టీల నుంచి రావడం ఆసక్తికరమే. ఆరు నెలల కిందట రేసులో లేదనుకున్న కాంగ్రెస్ ఇలా మార్పు చెందడం అనూహ్యమే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీఆర్‌ఎస్ అభ్యర్థులు, ముఖ్యనేతలకు సీఎం కేసీఆర్ వరుస కాల్స్
తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. మరో వారంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది బీఆర్‌ఎస్. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా.. నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు రోజూ ఫోన్లు చేస్తూ.. నియోజకవర్గాల్లో పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సానుకూలతలు, ప్రతికూలతలను విశ్లేషిస్తూ... వారికి దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం కేసీఆర్. సమన్వయంతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము-మధ్యాహ్నం సత్యసాయి మహాసమాధి దర్శనం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పుట్టపర్తికి చేరుకోనున్న రాష్ట్రపతి ముర్ము... పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒడిశా నుంచి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2గంటల 45నిమిషాలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సత్యసాయి సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి