Naga Panchami, November 22 Episode : ఈరోజు ఎపిసోడ్ లో దిగులుగా ఉన్న పంచమిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు మోక్ష.


మోక్ష: నువ్వు ఇలా ఉండకూడదు రేపు మన పెళ్లిరోజు రేపటి నుంచి మన జీవితం ఆనందకరంగా ఉండాలి.


పంచమి: జీవిత చరమాంకం దశలో ఉన్న వాళ్ళకి జీవితం అగమ్యగోచరంగా ఉంటుంది అని బాధగా చెప్తుంది.


మోక్ష: దానిని మంచిగా మలుచుకోవడం మన చేతిలోనే ఉంటుంది నా భర్తకి ఏమీ కాదు అని గట్టిగా నువ్వు విశ్వసించు. మనకి ఉన్న దిగులు కి ఈ రోజే చివరి రోజు కావాలి రేపు మనం పెళ్లి రోజుతో మన మధ్య కొత్త జీవితం ప్రారంభం అవ్వాలి. పెళ్లిరోజు సందర్భంగా నేను నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాను అలాగే నువ్వు కూడా నాకు గిఫ్ట్ ఇవ్వాలి.


పంచమి: నేను సుమంగళిగా ఉండిపోవాలి పోతే సుమంగళిగానే పోవాలి అలాంటి బహుమతి ఇవ్వండి.


మోక్ష: అది నా చేతిలో లేదు, నా చావు గురించి నువ్వు భయపడుతున్నావు. ఆ ఆలోచన మానుకో నాకు తండ్రి కావాలని ఉంది నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదే.


పంచమి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. పంచమి కాపాడుకోవాలంటే తనని ఎలా అయినా ఒప్పించాలి అనుకుంటాడు మోక్ష. మరోవైపు ఫణీంద్ర బుడబుక్కల వాడి రూపంలో పంచమి ఇంటికి వస్తాడు.


బుడబుక్కల వాడు : అమ్మ పలుకు జగదంబ పలుకు అంటూ ఉండగానే అక్కడికి మోక్ష మేనత్త వస్తుంది. ఏంటి ఆడపడుచువి నువ్వు అన్న పంచన బ్రతుకుతున్నావు.


అతను అలా చెప్తూ ఉండగానే ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు.


బుడబుక్కల వాడు ఒక్కొక్కళ్ళని చూస్తూ వాళ్ల జాతకం చెప్తూ ఉంటాడు. మోక్ష వాళ్ళ నాయనమ్మని చూసి నీకు రామలక్ష్మణులు లాంటి కొడుకులు ఉన్నారు అని చెప్తాడు. అలాగే చిత్ర వాళ్ల బుద్దులు గురించి చెప్తాడు. ఇంట్లో వాళ్ళు పడుతున్న బాధల గురించి చెప్తాడు. ఇంతలో మోక్ష పంచమి కూడా అక్కడికి వస్తారు.


బుడుబుక్కులవాడు: వీడు యమగండంతో పుట్టాడు చావుకి దగ్గరలో ఉన్నాడు తప్పించుకోలేడు చావు ఇతడిని వెంటాడుతుంది అంటూ మోక్షని చూసి చెప్తాడు. అలాగే పంచమి చూస్తూ ఈమె మానవ కన్య కాదు నాగ జాతికి చెందిన వ్యక్తి పొరపాటున మానవ జన్మ ఎత్తింది. కోరి కట్టుకున్న మొగుడికి దగ్గర అయితే మళ్లీ కలవడానికి తన భర్త ఉండడు మృత్యువు వెంటాడుతుంది అని హెచ్చరిస్తాడు.


అప్పటికే భయపడుతున్న పంచమిని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోతాడు మోక్ష. బుడబుక్కల వాడి రూపంలో ఉన్న ఫణీంద్ర.. మోక్ష తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కంగారుగా ఉన్న తల్లిదండ్రులు ఇద్దరినీ మొదటి ఇంట్లోకి తీసుకువెళ్తారు మోక్ష అన్నదమ్ములు. చిత్ర బళ్ళు మాత్రం బుడిబుక్కులు వాడిని వెతుక్కుంటూ ఇంటి బయటకు వస్తారు.


చిత్ర: అదేంటక్క ఇప్పుడే బయటికి వచ్చాడు కదా అప్పుడే మాయం అయిపోయాడు ఏంటి? అయినా వాడితో మాట్లాడటం అంత అవసరమా.


చిత్ర తోటి కోడలు : అవును వాడు చెప్పిన మాటలు అన్నీ నిజమే,  అంటే వాడి దగ్గర ఏవో అద్భుత శక్తులు ఉన్నాయి అవి ఉంటే మనం ఎప్పటికైనా సుబ్బు శక్తులని ఎదుర్కోవచ్చు.


ఆ మాటలు అన్నీ పాము రూపంలో వింటున్న ఫణీంద్ర బుడిబుక్కులవాడి రూపంలో మళ్లీ వాళ్ళ కంటికి కనబడతాడు. సడన్గా ఎదురుపడేసరికి షాక్ అవుతారు అక్క చెల్లెలు ఇద్దరు. నువ్వు చెప్పేదంతా నిజమేనా నువ్వు చెప్పింది నిజమైతే ఈ బంగారు నక్లెస్ ఇచ్చేస్తాను అంటుంది చిత్ర తోటి కోడలు. అయితే ఫణీంద్ర ఆ నెక్లెస్ ని పాములాగా మార్చేసి వాళ్ళని భయపెడతాడు.


ఆ పాముని అక్కడే పారేసి ఇంట్లోకి పరిగెడతారు అక్క చెల్లెలు ఇద్దరు. లోపలికి వచ్చిన ఇద్దరూ సుబ్బుని కాపాడమనడంతో సుబ్బు ఆ పాముని బయటికి పంపిస్తాడు. ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ బుడిబుక్కల వాడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.


మోక్ష అత్త : వాడు నిజమే చెప్పాడు లేకపోతే వాడికి నేను అన్న పంచమి అని ఎలా తెలుస్తుంది.


మోక్ష అన్నదమ్ములు : ప్రతి వాళ్ల పేరులోని ఏదో ఒక దేవుడి పేరు ఉంటుంది కదా అలాగే చెప్పి ఉంటాడు మీరు అవేవీ పట్టించుకోవద్దు.


ఇంతలో అక్కడికి వచ్చిన చిత్ర వాళ్లు మీ గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి మీకు భయం లేదు కానీ వాళ్ళు చెప్పింది అంతా నిజం అంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.