Top 5 Telugu Headlines Today 22 July 2023:

  
కొత్త చిక్కులు తెచ్చిపెట్టిన రాములమ్మ - కిరణ్‌కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి నష్టమేనా ?
తెలంగాణ బీజేపీ కీలక నేత  విజయశాంతి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. కనీసం మాట్లాడలేదు. లఆమెను ఎవరూ పట్టించుకోలేదన్న ఆగ్రహంతో వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. కానీ విజయశాంతి తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసిన వారు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయానని.. అలాంటి వేదికపై ఉండలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. నేరుగా పేరు చెప్పలేదు కానీ.. ఆమె మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  పూర్తి వివరాలు


బైజూస్ కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు - వైసీపీ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ !
వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మరో అంశంపై గురి పెట్టారు. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం విషయంలో సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మెగాడీఎస్సీని ప్రకటించలేదని.. ఒక్కరంటే ఒక్క టీచర్ నూ రిక్రూట్ చేయలేదన్నారు. కానీ తీవ్ర నష్టాల్లో ఉన్న ఓ స్టార్టప్‌కు మాత్రం వందల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు. బైజూస్‌కు కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ ను వైసీపీ ప్రభుత్వం పాటించిందా ? ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి ? ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు ?  ఈ వివరాలన్నీ పబ్లిక్ డోమైన్‌లో ఉన్నాయా ? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వీటిపై వైసీపీ గవర్నమెంట్ స్పందించాలన్నారు.  పూర్తి వివరాలు


మా అన్ననేంజెత్తరో? బండి భవితవ్యంపై కార్యకర్తల్లో ఆందోళన!
‘తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి  దృఢ సంకల్పంతో మీరు చేస్తున్న  కృషిని అధిష్టానం ఎందుకు గుర్తించలేదో నాకు అర్థమైతలేదు.  కష్టపడి పనిచేసి  గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీని మీరు తీసుకుపోయిండ్రన్న.. కానీ కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేదని నాకు అర్థమైపోయిందన్న..’ అంటూ బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించడంపై శుక్రవారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ అభిమాని ఆవేదన ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన  బీజేపీ నాయకుడు సొల్లు అజయ్ వర్మ ఓ వీడియోను విడుదల చేసి మరి ఆత్మహత్యకు  పాల్పడటం సంచలనం సృష్టించింది. బండిని తప్పించడంతో కరీంనగర్ ఎంపీ భవిష్యత్ ఏంటోనని  ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.  పూర్తి వివరాలు  


వ్యక్తిగత విమర్శలు రాజకీయంగా లాభిస్తాయా ? సీఎం జగన్ లెక్కలేంటి ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి సభలో విపక్ష నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎలాంటి ఘటనకు అయినా వంద శాతం వ్యతిరేకత.. లేదా వంద శాతం సానుకూలత రానట్లే.. సీఎం జగన్ చేసిన వ్యక్తిగత విమర్శల వీడియోలకూ అలాగే మిశ్రమ స్పందన వచ్చింది. వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరులు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిందాంట్లో తప్పేముందని.. వాదిస్తున్నారు. కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం..  చీఫ్ మినిస్టర్ పదవికి ఉన్న  ఔన్నత్యాన్ని కూడా ఆయన దిగజార్చేశారని.. అంటున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఆవేశంలో చేసినవి కావు. ప్రణాళిక ప్రకారం చేసినవే.  స్పీచ్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్లుగా  చూసి చదవడమే దీనికి సాక్ష్యం.  పూర్తి వివరాలు 


కిషన్ రెడ్డి నియామకం కొత్త సమస్యలకు దారి తీసిందా ? 
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ కార్యక్రమం వేదికగా జరిగిన పరిణామాలు చూస్తూంటే బీజేపీలో పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగకపోగా.. మరింతగా ముదిరాయన్న అభిప్రాయం  అందరికీ కలగడం సహజమే. చాలా మంది నేతలు పార్టీలో అంతర్గత విషయాలనే ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ సహజంగా ఇవే హైలెట్ అయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొంతమంది తీరుతో మరికొంత మందిఅ అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారంమూ ఉపందుకుంది. కొంత మంది నేతలు అసలు ఈ కార్యక్రమానికే హాజరు కాలేదు.  పూర్తి వివరాలు