ఏపీ బీజేపీ నేతలు చేయలేనిది పవన్ చేస్తున్నారా? జనసేనాని కామెంట్స్‌పై వైసీపీ రియాక్షన్ ఏంటీ?
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శలను డిఫెండ్ చేసుకోవడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. దాన్ని పొలిటికల్‌గా మరింత క్యాష్ చేసుకోవడంలో బీజేపీ అంతకంటే దారుణంగా ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు పవన్ వాటిని నేరుగా ప్రస్తావించకుండా కేసులు ప్రస్తావిస్తూ షా కామెంట్స్ నిజమే అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయి, అవినీతి పాలన సాగుతుందంటూ సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల విశాఖలో విమర్శలు చేశారు. వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారు.   పూర్తి వివరాలు


15వేల కోట్లు ఉంటే పవన్‌ను కొనేసేవాడిని, దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చెయ్: ద్వారంపూడి
కాకినాడలోజనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని అన్నారు. దమ్ముంటే పవన్ కాకినాడ నగరం నుంచి పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచినట్టు, 175 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను గెలిపించుకున్నట్టు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్టు సినిమాలు తీసుకుంటే బాగుంటుందన్నారు. అంతే కానీ నిజ జీవితంలో పవన్ గెలవలేరన్నారు.  పూర్తి వివరాలు


మహేశ్వరం వరకు మెట్రో విస్తరణ- వచ్చే ఎన్నికల్లో గెలిచేది మనమే- కేసీఆర్  
తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కను నాటి తొమ్మిదో విడత హరిత హారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గతంలో తాను హరితహారం అంటే నేతలు, అధికారులకు అర్థం కాలేదన్నారు సీఎం కేసీఆర్. హరితహారాన్ని చాలా మంది హస్యాస్పదం చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు అయితే జోకులు వేశారని గుర్తు చేశారు. కానీ హరితహారం ద్వారా రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని.. అందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. పూర్తి వివరాలు


ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో అవినాష్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన వివేక కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అవినాష్‌, సీబీఐకి నోటీసులు ఇచ్చింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అనంతరం విచారణను జులై 3కి వాయిదా వేశారు.  పూర్తి వివరాలు


రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్‌, పొలిటికల్ గాసిప్స్‌కు కిక్ ఇచ్చిన షర్మిల
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 53 ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఆయన బర్త్‌డే సందర్భంగా చాలా మంది ప్రముఖులు, పార్టీ శ్రేణులు విషెస్ చెబుతున్నారు. అయితే వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌ అధినాయకత్వానికి, వైఎస్‌ కుటుంబానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అప్పట్లో జగన్‌ ఓదార్పు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని.. తిరగబడితే జైల్లో కూడా పెట్టించారని వైఎస్‌ ఫ్యామిలీ ప్రచారం చేసింది. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ నుంచి ఎవరూ కాంగ్రెస్ అధినాయకత్వం పేరు వింటేనే విమర్శలు అందుకుంటారు.  పూర్తి వివరాలు