Optical Illusion: ఇది ఒక నంబర్ గేమ్ ఆప్టికల్ ఇల్యూషన్. మీ మెదడుకు కాసేపు పని చెబుతుంది. ఈ చిత్రంలో 775 సంఖ్య ఉంది. సాధారణంగా చూస్తే ఆ సంఖ్య మాత్రమే మీకు కనిపిస్తుంది. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే మరొక సంఖ్య కూడా ఉంది. ఆ సంఖ్య ఎక్కడుందో కనిపెట్టి చెప్పండి. అది కూడా 10 సెకండ్లలో చెప్పాలి. ఎక్కువ సమయాన్ని ఇస్తే ఎవరైనా చెబుతారు. 10 సెకన్లలో చెప్పే వాళ్లే తెలివైన వాళ్ళు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మెదడు, కంటికి మధ్య ఉండే సమన్వయ్యాన్ని సూచిస్తుంది.  కాబట్టి పది సెకన్లలో తేడాగా ఉన్న ఒక సంఖ్యను కనిపెట్టి చెప్పండి. 


జవాబు ఇదే
ఇప్పటికే సమాధానం కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. పది సెకన్లలో జవాబు కనిపెట్టారంటే మీరు మామూలోళ్లు కాదు, చాలా తెలివైన వారు. కనిపెట్టడానికి ఇబ్బంది పడుతున్నా వారు, కాస్త ఎక్కువ సమయం తీసుకుని మరీ కనిపెట్టేస్తారు. ఇంతకీ ఆ తేడా సంఖ్య ఏమిటిలో తెలుసా..  725. ఇది ఎనిమిదో నిలువ వరుసలో కిందనుంచి ఆరో స్థానంలో ఉంది. కింద ఇచ్చిన ఫోటోలో జవాబు కనిపిస్తోంది.



ఆప్టికల్ ఇల్యూషన్లు ఈనాటివి కావు. వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. టీవీలు వంటి వినోదాలు లేని కాలంలో ఇవే అప్పటి ప్రజలకు అలరించాయిట. అయితే వీటి సృష్టి కర్త  ఎవరో మాత్రం ఇంతవరకు తెలియలేదు . చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేసినా జవాబు దొరకలేదు. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మేలు చేస్తాయి. ఇలాంటివి మెదడుకు , కంటికి సమన్వయాన్ని పెంచుతాయి. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు.  విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి.  ఆప్టికల్ ఇల్యూషన్లను ఈ ఇన్ స్టా ఖాతాలో అధికంగా ఉంటాయి చూడండి. ఇందులో చాలా ఆప్టికల్ ఇల్యూషన్లు ఉన్నాయి.



" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


Also read: నా భర్త తమ్ముడే నా మాజీ లవర్, ఈ విషయం నా భర్తకి ఎలా చెప్పాలి?



Also read: రోజుకో పచ్చి ఉల్లిపాయ తింటే నెలసరి సమస్యలు దూరం









































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.