కృష్ణ, మురారీ ఇద్దరూ కలిసి లంచ్ వెళ్లాలని అనుకుంటారు. కారులో కాకుండా బైక్ మీద వెళ్తే బాగుంటుందని మురారీ చెప్తాడు. కృష్ణ బైక్ ఎక్కిన తర్వాత మురారీ మీద చెయ్యి వేయాలా వద్దా అని ఆలోచిస్తుంటే మురారీ కావాలని ముందుకు బ్రేక్ వేస్తాడు. దీంతో కృష్ణ మురారీ మీద పడిపోతుంది. ఇద్దరూ కలిసి సరదాగా వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ముకుంద స్టేషన్ కి వస్తుంది. మురారీనే తనని లోపలికి పిలవాలని అనుకుని బయట కారు దగ్గర నిలబడితే కానిస్టేబుల్ చూస్తాడు. ఆదర్శ్ భార్య వచ్చారని అనుకుని వెళ్ళి కమిషనర్ కి చెప్తాడు. సరే లోపలికి పంపించమని అంటాడు. కానిస్టేబుల్ వచ్చి ముకుందని సర్ లోపలికి రమ్మన్నారని అనేసరికి మురారీ పిలిచాడని అనుకుని సంతోషంగా లోపలికి వెళ్తుంది. కానీ ఎదురుగా కమిషనర్ ఉండేసరికి బిత్తరపోతుంది. ఆదర్శ్ కోసం వెతుకుతూనే ఉన్నామని త్వరలోనే ఆచూకీ తెలుసుకుని చెప్తానని అంటాడు. మురారీ గురించి అడిగితే కృష్ణతో కలిసి బైక్ మీద బయటకి వెళ్లాడని చెప్పేసరికి తిట్టుకుంటుంది.


Also Read: కేడీ బ్యాచ్ తిక్క కుదురుస్తున్న రిషి- గతాన్ని గుర్తు చేయొద్దని వసుకి వార్నింగ్


మీరిద్దరూ లంచ్ కి ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా అని ముకుంద మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్తుంది. కృష్ణకి తన మనసులో మాట చెప్పాలని మురారీ అనుకుంటాడు. మీరు నాతో మీ ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటున్నారు. ఆ డైరీ అమ్మాయి గురించి చెప్పాలని చూస్తున్నారు. అసలు మీ మనసులో డైరీ అమ్మాయి స్థానం ఏంటి? ఈ తింగరి పిల్ల స్థానం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నానని కృష్ణ మనసులో అనుకుంటుంది. మురారీ మనసులో మాట చెప్పేందుకు చూస్తుంటే తన ఫ్రెండ్ గోపి వస్తాడు. భలే టైమ్ కి వచ్చాడని ఇద్దరూ తిట్టుకుంటారు. కృష్ణ మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తానని కృష్ణ వెళ్ళిపోతుంది. ప్లాన్ అంతా నాశనం చేశావని తిడతాడు. అప్పుడే ముకుంద వచ్చి వాళ్ళ మాటలు వింటుంది.


గోపి: మీ పెళ్లి అయిన ఇన్నాళ్ల తర్వాత నీ ప్రేమ విషయం కృష్ణకి ప్రపోజ్ చేయాలని అనుకుంటావని నేనేమైనా కలకంటానా చెప్పు. అసలు ఎక్కడా చోటు దొరకనట్టు ఈ రెస్టారెంట్ లో చెప్పడం ఏంటి? మీరు లవర్స్ లేదా భార్యాభర్తలా ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది కదా


ముకుంద: ఏం మాట్లాడుతున్నాడు గోపి.. మురారీ కృష్ణకి ప్రపోజ్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ


మురారీ: ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు పైగా ముకుంద ఎక్కడ వింటుందోనని భయం


గోపి: రేపు ఈ విషయం ముకుందకి తెలిస్తే ఏం సమాధానం చెప్తావ్


మురారీ: అదే అర్థం కావడం లేదు నువ్వు నన్ను మర్చిపో అని చాలా సార్లు చెప్పాను కానీ నేను నిన్ను మర్చిపోయానని చెప్పలేకపోతున్నా. ఇంక నన్ను శాశ్వతంగా మర్చిపొమ్మని ముకుందకి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని కృష్ణకి చెప్పలేక నరకం అనుభవిస్తున్నా. అసలు ముకుంద నన్ను మర్చిపోగలదా అనే విషయం నన్ను అడుగు కూడా కదలనివ్వడం లేదు. తనకి నేను చాలా సార్లు చెప్పాను.. నేను నిన్ను ఆదర్శ్ భార్యాగా మాత్రమే చూస్తున్నానని చెప్పాను కానీ అర్థం చేసుకోవడం లేదు ఇంక ఎలా చెప్పాలి(ఆ మాటలు విని ముకుంద మనసు ముక్కలైపోతుంది)


Also Read: స్వప్న ఆశల మీద నీళ్ళు చల్లేసిన రాహుల్- టామ్ అండ్ జెర్రీలా కీచులాడుకుంటున్న రాజ్, కావ్య


రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ మురారీ మాటలు గురించి ఆలోచిస్తూ కొండ చివరకి వచ్చి నిలబడుతుంది. ఆత్మహత్య చేసుకోబోతుంటే ముకుంద అంతరాత్మ ఎంట్రీ ఇస్తుంది. చనిపోతే ఎవరికి లాభమని నిలదీస్తుంది. ప్రేమని బతికించుకోమని సలహా ఇస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం కృష్ణ వెళ్లిపోతే నువ్వు మురారీకి గుర్తుకు వస్తావ్ నీ ప్రేమ గుర్తొస్తుందని అనేసరికి ముకుంద మనసు మార్చుకుంటుంది.