శోభనం కోసం స్వప్న వాళ్ళ గదిని కావ్య రెడీ చేస్తూ ఉండగా రాజ్ కత్తి పట్టుకుని వస్తాడు. ఏంటి కత్తి తీసుకొచ్చారని కావ్య భయం భయంగా అడుగుతుంది. ఫ్రూట్స్ తీసుకొస్తే సరిపోతుందా కత్తి తీసుకురావొద్దా అని అంటాడు. కాసేపు ఇద్దరూ పోట్లాడుకుంటారు. దయచేసి నా లైఫ్ లో నుంచి వెళ్లిపోవా అని రాజ్ అంటే ఆ ఒక్కటి అడగకు అనేసి వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి రాజ్ దగ్గరకి వస్తుంది. మీరు అందరి ముందు చాలా సంతోషంగా తిరుగుతున్నారు. చాలా అన్యోన్యంగా ఉన్నారని అనుకుంటున్నారు. కానీ మీరు నటిస్తున్నారని నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఎప్పుడైతే మీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అన్నావో అప్పుడే వదిలేశానని అంటుంది.
రాజ్: ఆరోజు ఆవేశంలో ఏదో అన్నాను నువ్వు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నావ్ అంటే అది నిన్ను ఎంత బాధపెట్టిందో అర్థం అవుతోంది సోరి పిన్నీ
ధాన్యలక్ష్మి: నువ్వు జోక్యం చేసుకోవద్దు అన్నా నేను జోక్యం చేసుకుంటా ఎందుకంటే నువ్వు నాకొడుకువి. నీ జీవితం తప్పు దారిలో వెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను. ఇన్నాళ్ళూ మీరు ఏవో షరతులు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కావ్య తప్పు లేదని తేలింది కదా మరి తనని ఎందుకు దూరం పెట్టడం. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి
Also Read: వేదని చూసి కుళ్ళుకుంటున్న మాళవిక- బర్త్ డే రోజు తల్లికి అదిరిపోయే బహుమతి ఇచ్చిన ఖుషి
రాజ్: పిన్నీ ఇదంతా నా మీద ప్రేమతోనే చెప్తున్నావా, ఆ అమ్మాయి మీద ప్రేమతో చెప్తున్నావా?
ధాన్యలక్ష్మి: ఒక ఆడదానిగా చెప్తున్నా.. ఈ ఇంట్లో తను కోరుకున్నట్టు ఏదీ జరగలేదు భర్త దగ్గర కోరుకున్న సంతోషం దొరక్కపోతే తట్టుకోలేదు. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా
రాహుల్ గదిలోకి వచ్చి స్వప్నతో ఫస్ట్ నైట్ ఏంటి ఊహించుకుంటేనే కంపరంగా ఉంది. వెన్నెలతో పెళ్లి అని ఎన్నో ఊహించుకున్నా. నేను తనని మోసం చేశానని అంటారు కానీ ఇక్కడ మోసపోయింది నేను అని రగిలిపోతాడు. అప్పుడే స్వప్న గదిలోకి వస్తుంది. నన్ను కిడ్నాప్ చేయించింది కూడా నువ్వే అని నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడేమి మాట్లాడను ఎందుకంటే కడుపని డ్రామా ఆడి పెళ్లి చేసుకున్నా అది నిజమయ్యే వరకు నీతోనే కాదు ఈ ఇంట్లో వాళ్ళతో కూడా మంచిగా ఉండాలని స్వప్న మనసులో అనుకుంటుంది.
స్వప్నని చూడగానే రాహుల్ మొహం తిప్పేసుకుంటాడు. ఈ పెళ్లి జరుగుతుందని నువ్వు అసలు అనుకోలేదు కదా అనేసరికి రాహుల్ షాక్ అవుతాడు. నువ్వు కోరుకున్నది జరగదు పెళ్లి అయిపోయింది ఇంట్లో సెటిల్ అవుదామని అనుకుంటున్నావ్ కానీ అదేమీ జరగదని రాహుల్ మనసులో అనుకుంటాడు.
స్వప్న: నువ్వు అంటే నాకు పిచ్చి నిన్ను వదిలి నేను ఉండలేను. మనం ఎప్పటికీ విడిపోకూడదు
Also Read: దివ్య మీద చెయ్యి ఎత్తిన విక్రమ్ - తులసికి షాకిచ్చి, లాస్యని సపోర్ట్ చేసిన రాములమ్మ
రాహుల్: నువ్వు నన్ను ఇష్టపడుతుంది నన్ను కాదు నా వెనుక ఉన్న డబ్బు కోసమని నాకు తెలుసు. ఒక వారం రోజులు నిన్ను హోటల్ లో పెట్టినందుకు నా పర్స్ మొత్తం ఖాళీ చేశావాని మనసులో అనుకుంటాడు.
స్వప్న: జరిగింది అంతా మర్చిపోదాం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం
రాహుల్: నేను నిన్ను చాలా బాధపెట్టాను నువ్వు మర్చిపోయినంత సులువుగా నేను మర్చిపోలేకపోతున్నా అందుకే నాకు కాస్త టైమ్ కావాలి ఆ తర్వాత మనం ఇద్దరం భార్యాభర్తలుగా ఉందాం
స్వప్న: నువ్వు ఇంతగా చెప్తుంటే అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను సరే
రాహుల్ మనసు మార్చి త్వరగా నెల తప్పాలి లేదంటే నేను ఆడుతున్న కాపురం నాటకం బయట పడుతుందని స్వప్న టెన్షన్ పడుతుంది. కావ్య శోభనపు పెళ్లి కూతురిలాగా రెడీ అయి రాజ్ గదికి వస్తుంది. అసలు చూడకూడదని రాజ్ అనుకుంటాడు. శోభనానికి రెడీ అయి వచ్చానని చెప్పి కాసేపు ఆట పట్టించినట్టు రాజ్ ఊహించుకుంటాడు. తర్వాత కావ్య మామూలుగా వస్తుంది. మళ్ళీ ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలాగా పోట్లాడుకుంటారు.